శ్రీవాణి హత్య కేసులో నిందితులు వీరే..!
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో మిస్సింగ్ అయిన యువతి మృతదేహం వలిగొండలోని వాలిబాషా గుట్టల్లో లభ్యమైన విషయం తెలిసిందే. ఆ మృతదేహం శ్రీవాణిదిగా పోలీసులు గుర్తించారు. అంతకుముందే ఆమె కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఈ మేరకు పోలీసులు విచారణ జరిపారు. శ్రీవాణి మృతికి మిరియాల రవి, చిన్నపాక రవితేజ కారకులుగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 18న తల్లితో పాటు శ్రీవాణి వలిగొండకు వెళ్లింది. అంతకు ముందే బాధితురాలు, మిరియాల రవి […]
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో మిస్సింగ్ అయిన యువతి మృతదేహం వలిగొండలోని వాలిబాషా గుట్టల్లో లభ్యమైన విషయం తెలిసిందే. ఆ మృతదేహం శ్రీవాణిదిగా పోలీసులు గుర్తించారు. అంతకుముందే ఆమె కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఈ మేరకు పోలీసులు విచారణ జరిపారు. శ్రీవాణి మృతికి మిరియాల రవి, చిన్నపాక రవితేజ కారకులుగా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 18న తల్లితో పాటు శ్రీవాణి వలిగొండకు వెళ్లింది. అంతకు ముందే బాధితురాలు, మిరియాల రవి ప్రేమించుకున్నారు. ప్రియుడు పిలుపు మేరకు శ్రీవాణి ఒంటరిగా వలిగొండలోని వాలిభాష గుట్టకు వెళ్లింది. అప్పటికే అక్కడ మిరియాల రవి అతని స్నేహితుడు రవితేజ వెయిట్ చేస్తున్నారు. మిత్రుడి సాయంతో ప్రియుడు రవి శ్రీవాణిపై అత్యాచారం చేసి హతమార్చాడు. అయితే, యువతి హత్య జరిగిన రోజే మిరియాల రవి కూడా అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 29రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు రవితేజ కీలక వెల్లడించాడు. శ్రీవాణిని ఆమె ప్రియుడు రవి అత్యాచారం చేసి హత్యచేశాడని.. కానీ, రవి ఎలా చనిపోయాడో తెలిదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రవితేజపై అట్రాసిటీ కేసుతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.