కోహ్లీ.. అది వారికి అనవసరం : రవి శాస్త్రి ఘాటు వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్‌గా హిట్ మ్యా్న్ రోహిత్‌ శర్మకు బీసీసీఐ బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఇండియా జట్టులో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. కింగ్ కోహ్లీ తెలివైన కెప్టెన్ అని కితాబు ఇచ్చాడు. ఇదే సమయంలో కెప్టెన్‌గా జట్టు సాధించిన విజయాలను మాత్రమే జనం పట్టించుకుంటారని.. […]

Update: 2021-12-09 23:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్‌గా హిట్ మ్యా్న్ రోహిత్‌ శర్మకు బీసీసీఐ బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఇండియా జట్టులో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు.

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. కింగ్ కోహ్లీ తెలివైన కెప్టెన్ అని కితాబు ఇచ్చాడు. ఇదే సమయంలో కెప్టెన్‌గా జట్టు సాధించిన విజయాలను మాత్రమే జనం పట్టించుకుంటారని.. బ్యాట్స్‌మెన్‌గా తాను ఎంతగా రాణించాడనే విషయం వారికి అనవసరమని శాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విరాట్ ఎంతో మెచ్యూరిటీ ఉన్న ఆటగాడని ప్రశంసించాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తాను సాధించిన రికార్డులను చూసి గర్వపడాలని అన్నారు.

ఈ క్రమంలోనే రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. రోహిత్ టీమ్ అవసరాలకు తగ్గట్టుగా ఆడుతాడని.. అది హిట్ మ్యాన్ గొప్పతనమని పేర్కొన్నాడు. జట్టులో ఉన్న అన్ని వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడంలో రోహిత్ దిట్ట అని ప్రశంసలు కురిపించాడు. ఏది ఏమైనా ఇండియా టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం అంత సులభమైన విషయం కాదని రవి శాస్త్రి వెల్లడించారు.

Tags:    

Similar News