రవీనా.. వచ్చే జన్మలో నన్ను పెళ్లి చేసుకుంటారా?
దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా రెండు వారాలపాటు లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో గ్రీన్ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘అద్భుతం.. పాన్, గుట్కా షాపుల తెరుచుకుంటున్నాయి. ఇక ఉమ్మివేయడం కూడా మళ్లీ ప్రారంభమవుతుంది’ అంటూ రవీనా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అయితే రవీనా టాండన్ తాజాగా ఓ ఫోటోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. దానికి ఓ […]
దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా రెండు వారాలపాటు లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో గ్రీన్ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘అద్భుతం.. పాన్, గుట్కా షాపుల తెరుచుకుంటున్నాయి. ఇక ఉమ్మివేయడం కూడా మళ్లీ ప్రారంభమవుతుంది’ అంటూ రవీనా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అయితే రవీనా టాండన్ తాజాగా ఓ ఫోటోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. దానికి ఓ నెటిజన్ ‘వచ్చే జన్మలోనైనా నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అంటూ ప్రశ్నించాడు. దానికి రవీనా కూడా ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా.. చాలా సరదాగా సమాధానమిచ్చారు.
తాజాగా ఆమె గతంలో వేసవి కాలంలో మంచు ప్రదేశాల్లో సేద తీరుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ‘వేసవి కాలం వేడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మంచు ప్రదేశాలకు టూర్ వెళ్లాలని నా మనసు కోరుకుంటుంది’ అనే క్యాప్షన్ కూడా ఆ ఫోటో కు జత చేశారు. ఆమె అందమైన ఫోటోలను చూసిన అభిమానులు ఊరుకుంటారా? కామెంట్ల వర్షం కురిపించారు. “మేడమ్ సార్.. మేడమ్ అంతే..” ‘మీరెప్పుడూ క్వీనే.. లవ్ యూ’అనే కామెంట్లు పెట్టారు. మరో నెటిజన్ “రవీనా మేడమ్.. వచ్చే జన్మలో నన్ను పెళ్లి చేసుకుంటారా?” అని కోరాడు. దీనికి నటి స్పందిస్తూ.. “మన్నించాలి, ఇప్పటికే ఏడుగురికి బుక్ అయిపోయింది. మరో ఏడు జన్మల వరకు ఖాళీగా లేను” అంటూ కొంటెగా సమాధానమిచ్చారు. 2004లో అనిల్ థడానీ ని రవీనా వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న రవీనా భిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమె ‘కేజీఎఫ్ 2 ’లో కీలక పాత్రలో నటిస్తున్నారు.
tags: raveena tandon, bollywood heroine, instagram, comments