వాళ్లైతే… ఈ బియ్యం తింటారా?

దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని పారుపల్లి గ్రామ రేషన్ దుకాణంలో పురుగులు పట్టిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పది కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రేషన్ డీలర్లు మాత్రం ముక్కిన, పురుగులు పట్టిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బియ్యం పంపిణీ చేసే అధికారులు, రాజకీయ నాయకులు ఎవరైనా తింటారా అని […]

Update: 2020-08-07 02:24 GMT

దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని పారుపల్లి గ్రామ రేషన్ దుకాణంలో పురుగులు పట్టిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పది కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే రేషన్ డీలర్లు మాత్రం ముక్కిన, పురుగులు పట్టిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బియ్యం పంపిణీ చేసే అధికారులు, రాజకీయ నాయకులు ఎవరైనా తింటారా అని ప్రశ్నిస్తున్నారు. మాలాంటి సామాన్యులు తిని ఆరోగ్యం పాడుచేసుకుని, ఆసుపత్రి పాలైతే, ఆ విధంగా కూడా ప్రజల నుంచి పైసలు వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వా లు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News