గమనిక : రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు, రేపు నో రేషన్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర డేటా సెంటర్‌లో హైడ్ ఎండ్ యూపీఎస్‌ను ఆధునీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆన్లైన్ సేవలు నిలిపి వేయడం జరిగింది. ఇందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీకి కూడా అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వలన ఈరోజు, రేపు రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. తిరిగి ఆదివారం నుంచి యధావిధిగా రేషన్ దుకాణాల్లో […]

Update: 2021-07-09 03:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర డేటా సెంటర్‌లో హైడ్ ఎండ్ యూపీఎస్‌ను ఆధునీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆన్లైన్ సేవలు నిలిపి వేయడం జరిగింది. ఇందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీకి కూడా అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వలన ఈరోజు, రేపు రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు.

తిరిగి ఆదివారం నుంచి యధావిధిగా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ విషయం తెలియక చాలా మంది లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు చేరుకొని గంటల తరబడి రేషన్ కోసం నిరీక్షించారు. రెండు రోజుల పాటు రేషన్ పంపిణీ ఉండదని దుకాణాల నిర్వాహకులు తెలుపడంతో నిరాశగా వెనుదిరిగారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వలన పేదలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెల పంపిణీ చేసిన సరుకులు పూర్తిగా అయిపోవడంతో ఈ రెండు రోజుల పాటు మార్కెట్ లో బియ్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News