పార్లమెంట్ సభ్యులను పరిగెట్టించిన ఎలుక

దిశ, వెబ్‌డెస్క్: రసవత్తరంగా పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. అధికార, విపక్ష ఎంపీల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇంతలో ఓ చిట్టి ఎలుక పార్లమెంట్‌లోకి ప్రవేశిచింది. అప్పటికే మాట్లాడటం ప్రారంభించిన స్పీకర్ నోట్లో ఒక్కసారిగా మాట ఆగిపోయింది.. ఏం జరిగిందని మిగిలిన సభ్యులు ఆసక్తిగా గమనించారు. ఒక్కసారిగా ఎలుకను గమనించిన ఎంపీలు, స్పీకర్ అందరూ బయటకు పరుగులు తీశారు. కాసేపటి తర్వాత ఎలుకను సిబ్బంది బయటకు పంపించిన తర్వాత […]

Update: 2021-07-22 20:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: రసవత్తరంగా పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. అధికార, విపక్ష ఎంపీల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇంతలో ఓ చిట్టి ఎలుక పార్లమెంట్‌లోకి ప్రవేశిచింది. అప్పటికే మాట్లాడటం ప్రారంభించిన స్పీకర్ నోట్లో ఒక్కసారిగా మాట ఆగిపోయింది.. ఏం జరిగిందని మిగిలిన సభ్యులు ఆసక్తిగా గమనించారు. ఒక్కసారిగా ఎలుకను గమనించిన ఎంపీలు, స్పీకర్ అందరూ బయటకు పరుగులు తీశారు. కాసేపటి తర్వాత ఎలుకను సిబ్బంది బయటకు పంపించిన తర్వాత మళ్లీ సభ ప్రారంభం అయింది.

ఈ ఆసక్తికర ఘటన స్పెయిన్‌ పార్లమెంట్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని సెవిల్‌లో ఉన్న ఆండలూసియా పార్లమెంట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా ఓ ఎలుకను చూసి భయపడటం, పరుగులు తీయడం ఏంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. యువత ఎంపీలపై సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News