బ్యూటీ టిప్స్ షేర్ చేసిన క్యూటీ

మహిళలు చర్మ సంరక్షణ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారన్న విషయం తెలిసిందే. తమ ముఖంపై ఓ చిన్న మొటిమ వచ్చినా సరే తట్టుకోలేకపోతారు. ఇక హీరోయిన్ల సంగతి వేరే చెప్పక్కర్లేదు. బ్యూటీకి చాలా ప్రాధాన్యతనిస్తారు. అయితే, లేటెస్ట్‌గా టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందాన్న.. కొన్ని బ్యూటీ టిప్స్‌, స్కిన్ కేర్ సొల్యూషన్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది. తన స్కిన్ కేర్ సీక్రెట్స్ కూడా రివీల్ చేసింది. అంతేకాదు తన అనుభవం నేర్పిన పాఠాల ఆధారంగా.. స్కిన్ అలెర్జీ […]

Update: 2020-08-04 05:13 GMT

మహిళలు చర్మ సంరక్షణ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారన్న విషయం తెలిసిందే. తమ ముఖంపై ఓ చిన్న మొటిమ వచ్చినా సరే తట్టుకోలేకపోతారు. ఇక హీరోయిన్ల సంగతి వేరే చెప్పక్కర్లేదు. బ్యూటీకి చాలా ప్రాధాన్యతనిస్తారు. అయితే, లేటెస్ట్‌గా టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందాన్న.. కొన్ని బ్యూటీ టిప్స్‌, స్కిన్ కేర్ సొల్యూషన్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది. తన స్కిన్ కేర్ సీక్రెట్స్ కూడా రివీల్ చేసింది. అంతేకాదు తన అనుభవం నేర్పిన పాఠాల ఆధారంగా.. స్కిన్ అలెర్జీ టెస్ట్ చేయించుకోమని సలహా ఇచ్చింది.

‘రెండేళ్ల కింద నా చ‌ర్మం చాలా బ్యాడ్‌గా ఉండేది. కానీ నాకు నేను చాలా నీట్‌గా ఉంటాను. అయినా కూడా.. నాకెందుకిలా అవుతుందో తెలియకపోయేది. ఆ త‌ర్వాత అలర్జీ టెస్ట్ చేయించడంతో నాకు అల‌ర్జీ ఉంద‌ని తేలింది. అప్ప‌టి నుంచి నా శ‌రీరానికి అవ‌స‌రంలేని, ప‌డ‌ని ఆహారాన్ని ప‌క్క‌న పెట్ట‌డం మొద‌లు పెట్టాను. నేను పూర్తిగా శాఖాహారిని. అయితే దోసకాయలు, టమోటాలు, క్యాప్సికమ్, బంగాళదుంపలు తినడం మానేశాను. ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా మిస్సవుతున్నాను. అప్పటి నుంచి నా చ‌ర్మంతో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు’ అంటూ తన బ్యూటీ సీక్సెట్స్ చెప్పేసింది.

మీ శరీరానికి ఏవి సరిగ్గా పడతాయో వాటినే స్వీకరించండని చెప్పిన రష్మిక.. నీళ్లు ఎక్కువగా తాగితే చర్మాన్ని మరింత కాంతివంతం చేస్తుందని తెలిపింది. అదేవిధంగా సన్ స్క్రీన్ లేకుండా బయట తిరగొద్దని, స్కిన్‌కు మాయిశ్చరైజర్ తప్పక ఉపయోగించాలని సూచించింది. రోజుకు రెండు సార్లు మాత్రమే ముఖం కడుక్కోవాలని, హార్ష్‌గా ఉండే.. ఫేస్ వాష్‌లను అస్సలు ఉపయోగించకూడదని సలహాలిచ్చింది ఈ ఛలో భామ.

https://www.instagram.com/p/CDbzYvYpogJ/?utm_source=ig_embed&utm_campaign=loading

Tags:    

Similar News