సూపర్‌స్టార్‌కు లిల్లీ సర్‌ప్రైజ్!

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్న రష్మిక మందన్న.. తన కోస్టార్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీకి సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. డైరెక్ట్‌గా ఫ్రెండ్స్‌ను కలిసే వీల్లేకుండా పోయింది. దీంతో ఆన్‌లైన్‌లో గిఫ్ట్స్ పంపించింది డియర్ లిల్లీ. పచ్చి మామిడికాయలు, మామిడికాయ పచ్చడి, డ్రింక్స్‌ను ప్యాక్ చేసి పంపించిన క్యూట్ డాల్ రష్మిక.. తన హ్యాండ్ రిటెన్ నోట్ కూడా జత చేసింది. ఈ బహుమతిని సోషల్ మీడియాలో షేర్ […]

Update: 2020-06-29 04:41 GMT

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్న రష్మిక మందన్న.. తన కోస్టార్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీకి సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. డైరెక్ట్‌గా ఫ్రెండ్స్‌ను కలిసే వీల్లేకుండా పోయింది. దీంతో ఆన్‌లైన్‌లో గిఫ్ట్స్ పంపించింది డియర్ లిల్లీ.

పచ్చి మామిడికాయలు, మామిడికాయ పచ్చడి, డ్రింక్స్‌ను ప్యాక్ చేసి పంపించిన క్యూట్ డాల్ రష్మిక.. తన హ్యాండ్ రిటెన్ నోట్ కూడా జత చేసింది. ఈ బహుమతిని సోషల్ మీడియాలో షేర్ చేసిన మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్.. రష్మికకు థ్యాంక్స్ చెప్పింది. ‘కరోనా టైమ్‌లో అందిన ఫస్ట్ గిఫ్ట్’ అని తెలిపిన నమ్రత.. హ్యాపీ మాన్‌సూన్ అంటూ నెటిజన్లకు విష్ చేసింది.

https://www.instagram.com/p/CB_FTvgD8Gh/?utm_source=ig_web_copy_link

కాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో గిరిజన అమ్మాయిగా ప్రత్యేక పాత్రలో అలరించనుంది రష్మిక. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. అటు తమిళ్‌లో ఇళయదళపతి విజయ్ నెక్స్ట్ మూవీలోనూ చాన్స్ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News