ఎక్స్ లవర్‌కు ‘ఎస్’ చెప్పిన రష్మిక?
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘కిరాక్ పార్టీ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాలం కలిసిరావడంతో తెలుగు, తమిళ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే.. కిరాక్ పార్టీ సినిమా టైమ్‌లోనే హీరో ‘రక్షిత్ శెట్టి’తో ప్రేమలో పడ్డ ఈ భామ.. ఇరు కుటుంబాల ఆమోదంతో తనతో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ బ్రేకప్ చెప్పేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. కాగా, కన్నడంలో ఘన విజయం సాధించిన తన […]
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘కిరాక్ పార్టీ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాలం కలిసిరావడంతో తెలుగు, తమిళ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే.. కిరాక్ పార్టీ సినిమా టైమ్‌లోనే హీరో ‘రక్షిత్ శెట్టి’తో ప్రేమలో పడ్డ ఈ భామ.. ఇరు కుటుంబాల ఆమోదంతో తనతో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ బ్రేకప్ చెప్పేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.
కాగా, కన్నడంలో ఘన విజయం సాధించిన తన ఫస్ట్ మూవీ ‘కిరాక్ పార్టీ’కి.. ఇప్పుడు సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడట రక్షిత్ శెట్టి. కానీ హీరోయిన్‌గా మాత్రం మరో అమ్మాయిని తీసుకోవాలనే యోచనలో ఉన్నాడట. అయితే దర్శక నిర్మాతలు మాత్రం ‘రష్మిక’ అయితేనే బాగుంటుందని చెప్తున్నారట. ఈ విషయం రష్మిక చెవిన పడటంతో.. తనకు లైఫ్ ఇచ్చిన సినిమా సీక్వెల్ చేసేందుకు తనకేమీ ఇబ్బంది లేదని చెప్పిందట. రక్షిత్ శెట్టితో కలిసి నటించేందుకు అస్సలు సమస్యే లేదని స్పష్టం చేసిందట. ఈ నేపథ్యంలో రక్షిత్, రష్మిక మళ్లీ కలిసి నటిస్తారా లేక రక్షిత్ మరో హీరోయిన్ వైపే మొగ్గు చూపుతాడా అన్నది చూడాలి.