అభిమానులకు రష్మిక చాలెంజ్!

వృక్షో రక్షతి రక్షిత: అన్నారు పెద్దలు. వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయన్నది సారాంశం. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో చెట్లను నరకడమే కానీ, కొత్తగా మొక్కలను పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదన్నది సత్యం. ఇలా చేస్తూ పోతే పర్యావరణానికి హాని కలిగి భారీ విపత్తులు ఎదుర్కొంటామని తెలిసినా సరే.. మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కానీ సెలబ్రిటీల వల్ల మార్పు తీసుకురాగలమని గుర్తించిన టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.. సినీ […]

Update: 2020-07-16 02:42 GMT

వృక్షో రక్షతి రక్షిత: అన్నారు పెద్దలు. వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయన్నది సారాంశం. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో చెట్లను నరకడమే కానీ, కొత్తగా మొక్కలను పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదన్నది సత్యం. ఇలా చేస్తూ పోతే పర్యావరణానికి హాని కలిగి భారీ విపత్తులు ఎదుర్కొంటామని తెలిసినా సరే.. మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కానీ సెలబ్రిటీల వల్ల మార్పు తీసుకురాగలమని గుర్తించిన టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.. సినీ ప్రముఖులను ‘గ్రీన్ ఇండియా చాలెంజ్‌’లో ఇన్వాల్వ్ చేశారు. ఇందులో భాగంగా విశ్వక్ సేన్, శర్వానంద్, కీర్తి సురేశ్ లాంటి హీరో హీరోయిన్లు మొక్కలు నాటి, అభిమానులు కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించాలని కోరారు.

https://www.instagram.com/p/CCq1fu0pOXX/?utm_source=ig_web_copy_link

తాజాగా అక్కినేని నాగార్జున సైతం తన కోడలు సమంతతో కలిసి మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సమంత.. రష్మిక మందన్నాను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేయగా.. చాలెంజ్‌ను స్వీకరించిన ‘లిల్లీ బేబీ’ తన గార్డెన్‌లో మూడు మొక్కలను నాటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాశీ ఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్, అశిక రంగనాథ్‌లను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే తన అభిమానులు కూడా ఈ చాలెంజ్‌ స్వీకరించాలని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌ను నామినేట్ చేస్తూ చాలెంజ్ కొనసాగించాలని కోరింది.

Tags:    

Similar News