క్రేజీ చాన్స్ కొట్టేసిన రష్మిక

హీరోయిన్ రష్మిక మందన్న ఫుల్ స్వింగ్‌లో ఉంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న భామ.. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో క్రేజీ చాన్స్ కొట్టేసింది. తెలుగులో స్టార్ హీరోల సరసన వరుసగా చాన్స్‌లు కొట్టేస్తున్న ఈ కన్నడ భామ.. కోలీవుడ్‌లోనూ చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు సినిమాల్లో ఆఫర్లు అందుకున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా తమిళ్ సూపర్ స్టార్ విజయ్ పక్కన నటించే అవకాశం దక్కించుకుందట. విజయ్ మాస్టర్ సినిమాలో […]

Update: 2020-06-20 09:14 GMT

హీరోయిన్ రష్మిక మందన్న ఫుల్ స్వింగ్‌లో ఉంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న భామ.. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో క్రేజీ చాన్స్ కొట్టేసింది. తెలుగులో స్టార్ హీరోల సరసన వరుసగా చాన్స్‌లు కొట్టేస్తున్న ఈ కన్నడ భామ.. కోలీవుడ్‌లోనూ చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు సినిమాల్లో ఆఫర్లు అందుకున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా తమిళ్ సూపర్ స్టార్ విజయ్ పక్కన నటించే అవకాశం దక్కించుకుందట.

విజయ్ మాస్టర్ సినిమాలో రష్మిక నటిస్తుందని తొలుత వార్తలు వచ్చినా.. చివరికి ఆ చాన్స్ కాస్త మాళవిక మోహనన్‌ను వరించింది. విజయ్ తర్వాతి చిత్రం మురుగదాస్ డైరెక్షన్‌లో వస్తుండగా.. ఈ సినిమాకు రష్మిక కన్‌ఫర్మ్ అయినట్టు సమాచారం. విజయ్‌కు ఇది 65వ చిత్రం కావడం.. స్టార్ డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం తనను వరించడంతో ఫుల్ ఖుష్ అవుతోందట ఈ కన్నడ బ్యూటీ.

Tags:    

Similar News