మాటలతో నొప్పించొద్దు : రాశీ ఖన్నా

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీ డాల్ రాశీ ఖన్నా ప్రకృతి అందాల్లో సేద తీరుతోంది. ఆహ్లాదమైన వాతావరణం, మేఘాలను అందుకుంటున్న కొండలు, ఆనందాన్ని పంచుతున్న నీటి సవ్వడుల మధ్య ఎంతో జాయ్‌ఫుల్‌గా ఉన్న రాశి.. అందరూ బాగుండాలని, ఒకరి సంతోషం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుందని చెబుతోంది. అంతేకాదు తన డిజిటల్ ఎంట్రీ గురించి ఓ హింట్ కూడా ఇచ్చింది. ‘సమస్త విశ్వంలో ప్రతి ఒక్కరం మనకు కనిపించని ఎన్నో వెబ్ స్టోరీలతో కనెక్ట్ అయి ఉన్నాం. తెలుసో, తెలియదో […]

Update: 2020-11-20 05:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీ డాల్ రాశీ ఖన్నా ప్రకృతి అందాల్లో సేద తీరుతోంది. ఆహ్లాదమైన వాతావరణం, మేఘాలను అందుకుంటున్న కొండలు, ఆనందాన్ని పంచుతున్న నీటి సవ్వడుల మధ్య ఎంతో జాయ్‌ఫుల్‌గా ఉన్న రాశి.. అందరూ బాగుండాలని, ఒకరి సంతోషం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుందని చెబుతోంది. అంతేకాదు తన డిజిటల్ ఎంట్రీ గురించి ఓ హింట్ కూడా ఇచ్చింది.

‘సమస్త విశ్వంలో ప్రతి ఒక్కరం మనకు కనిపించని ఎన్నో వెబ్ స్టోరీలతో కనెక్ట్ అయి ఉన్నాం. తెలుసో, తెలియదో కానీ.. మనమంతా నిశ్శబ్ధంగా మాట్లాడుకుంటాం. ఎవరి వెనకాల ఏదీ మాట్లాడొద్దు. తెలిసీ తెలియక గాయపరిచే మాటలు అసలే వద్దు. వాటివల్ల మనకు హాని కలుగుతుంది. మన నోటి నుంచి వచ్చే మాటలు ఎక్కడికీ పోవు. అవి ఈ విశ్వంలోనే ఉండి, మళ్లీ మనకే తిరిగొస్తాయి. అందుకే ఎవరినీ మాటలతో నొప్పించకండి. ఎవరికీ హాని చేయకుండా కరుణ చూపండి. ఒకరి పెయిన్ మనందరినీ బాధ పెడుతుంది. ఒకరి సంతోషం మనందరికీ సంతోషాన్ని పంచుతుంది’ అంటూ రాశీ ఖన్నా తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. అయితే రాశి ప్రస్తుతం ‘ప్రేమించడానికి 40 రూల్స్’ అనే పుస్తకం చదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ కోట్‌ను అందులోంచే షేర్ చేసింది రాశి.

రాశీ ఖన్నా చెబుతున్న మాటల ప్రకారం తాను కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రాశి ప్రస్తుతం తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News