డాక్టర్లను అర్థం చేసుకోలేమా? : రాశి
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వైద్యులపై కరోనా రోగి బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఖండిస్తూ డాక్టర్లు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ జూనియర్ డాక్టర్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అయ్యాయి. నాలుగు కోట్ల మంది ఉన్న తెలంగాణలో కేవలం గాంధీ హాస్పిటల్, గాంధీ డాక్టర్లు మాత్రమే ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి? ఇంత ఒత్తిడిలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా మాకిచ్చే గౌరవం ఇదా? […]
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వైద్యులపై కరోనా రోగి బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఖండిస్తూ డాక్టర్లు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ జూనియర్ డాక్టర్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అయ్యాయి. నాలుగు కోట్ల మంది ఉన్న తెలంగాణలో కేవలం గాంధీ హాస్పిటల్, గాంధీ డాక్టర్లు మాత్రమే ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి? ఇంత ఒత్తిడిలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా మాకిచ్చే గౌరవం ఇదా? అని ప్రశ్నించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
ఈ క్రమంలోనే ఈ వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్ రాశీ ఖన్నా.. ‘తక్కువ జీతం, తీవ్ర ఒత్తిడి, పని భారం.. ప్రస్తుతం గాంధీ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్య అని’ అర్థమవుతున్నట్టు తెలిపింది. ఈ విపత్కర పరిస్థితి ప్రతీఒక్కరికి కష్టమే.. కానీ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మనం గౌరవం, మద్ధతు ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వారి సమస్య పరిష్కారానికి సహాయం చేస్తారని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌లోనే ఉన్న రాశీ ఖన్నా.. గిటార్ వాయించడంతో పాటు తమిళ్ నేర్చుకుంటోంది. ఇంతకు ముందు కొన్ని తెలుగు సినిమాల్లో పాటలు కూడా పాడిన ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్.. ఈ మధ్య గిటార్ వాయిస్తూ సాంగ్ పాడిన వీడియో పోస్ట్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.
Underpaid, over stressed, overworked! These are difficult times for everyone but we need to respect and support our frontliners! I hope the concerned authorities come forward and help unload their burden! 🙏🏻🙏🏻 #GandhiHospital #SaveDoctorsSavesociety 🙏🏻🙏🏻 pic.twitter.com/S7RYSatutt
— Raashi (@RaashiKhanna) June 11, 2020