వెల్‌కమ్ టు ఇండియా
దిశ, వెబ్ డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ముంబై మీదుగా అంబాలా ఎయిర్ బేస్ లోకి ఈ విమానాలు చేరుకోనున్నాయి. ఈ ఐదు విమానాల్లో రెండు శిక్షణా విమానాలు ఉన్నాయి. మిగతా మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి. యూఏఈలోని ఆల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుంచి ఇవి భారత్ కు బయల్దేరి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ నుంచి బయలుదేరగానే యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్ కతాకు రేడియో సందేశం వచ్చింది. దీంతో […]
దిశ, వెబ్ డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ముంబై మీదుగా అంబాలా ఎయిర్ బేస్ లోకి ఈ విమానాలు చేరుకోనున్నాయి. ఈ ఐదు విమానాల్లో రెండు శిక్షణా విమానాలు ఉన్నాయి. మిగతా మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి. యూఏఈలోని ఆల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుంచి ఇవి భారత్ కు బయల్దేరి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ నుంచి బయలుదేరగానే యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్ కతాకు రేడియో సందేశం వచ్చింది.
దీంతో వెల్ కమ్ టూ ఇండియన్ ఓషియన్ అంటూ ఐఎన్ఎస్ కోల్ కతా యుద్ధనౌక రేడియో సందేశం పంపింది. ఈ ఐదు రాఫెల్ విమానాలకు రక్షణగా మరో రెండు సుఖోయ్ జెట్స్ వస్తున్నాయి. ఈ విమానాలు ధ్వని కంటే నాలుగు రెట్లు వేగంగా ప్రయాణించగలవు. శతృ శిభిరాలను క్షణాల్లో ధ్వంసం చేసే సామర్థ్యం వీటి సొంతం.