అతిపెద్ద డంపింగ్ యార్డును ప్రారంభించిన రాంకీ
దిశ, న్యూస్‌బ్యూరో: రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ (రీల్) ఛత్తీస్‌ఘడ్‌లో అతిపెద్ద ఘన వ్యర్థ నిర్వహణ కర్మాగారాన్ని (రోజుకు 700 టన్నుల వ్యర్థాలను నిర్వహించే సామర్థ్యంతో) ప్రారంభించింది. రాయ్‌పూర్‌లో బుధవారం ఈ ప్లాంట్‌ను సీఎం భూపేష్ భగల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించారు. కార్యక్రమంలో రాయ్‌పూర్ నగర మేయర్ శ్రీ అజాజ్ ధీబార్, మున్సిపల్ కమిషనర్ శ్రీ సౌరభ్ కుమార్ పాల్గొన్నారు. రాయ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్, ఢిల్లీ ఎంఎస్‌డబ్ల్యు సొల్యూషన్ లిమిటెడ్ (రాంకీ […]
దిశ, న్యూస్‌బ్యూరో: రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ (రీల్) ఛత్తీస్‌ఘడ్‌లో అతిపెద్ద ఘన వ్యర్థ నిర్వహణ కర్మాగారాన్ని (రోజుకు 700 టన్నుల వ్యర్థాలను నిర్వహించే సామర్థ్యంతో) ప్రారంభించింది. రాయ్‌పూర్‌లో బుధవారం ఈ ప్లాంట్‌ను సీఎం భూపేష్ భగల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించారు. కార్యక్రమంలో రాయ్‌పూర్ నగర మేయర్ శ్రీ అజాజ్ ధీబార్, మున్సిపల్ కమిషనర్ శ్రీ సౌరభ్ కుమార్ పాల్గొన్నారు. రాయ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్, ఢిల్లీ ఎంఎస్‌డబ్ల్యు సొల్యూషన్ లిమిటెడ్ (రాంకీ కంపెనీ) మధ్య 15 ఏళ్ల ఒప్పందంలో భాగంగా రాయ్‌పూర్లోని సక్రీ వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.197 కోట్లు కాగా, రూ. 127 కోట్లను ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి వినియోగించారు. ఒప్పందంలో భాగంగా మొత్తం 70వార్డుల్లో ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను రాంకీ సేకరించాల్సి ఉంటుంది. దీనికోసం 220 టాటాఏస్ వాహనాలు, 29 పోర్టబల్ కంపాక్టర్లు, 6 హుక్ లిఫ్టర్లు, 4 రిఫ్యూజ్ కంపాక్టర్లు, 6 టిప్పర్లు, 2జెసీబీలు వినియోగించనున్నారు.