ఎమ్మెల్యే రేగా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

దిశ, మణుగూరు: ప్రపంచ మేధావి, దళితబిడ్డ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీటీసీ పొశం నరసింహారావు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రేగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ…భారతదేశాన్ని 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ వాళ్లు పరిపాలించారని, ఆ తర్వాత 1947 ఆగస్టు 15న మన […]

Update: 2021-11-26 08:04 GMT

దిశ, మణుగూరు: ప్రపంచ మేధావి, దళితబిడ్డ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీటీసీ పొశం నరసింహారావు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రేగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ…భారతదేశాన్ని 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ వాళ్లు పరిపాలించారని, ఆ తర్వాత 1947 ఆగస్టు 15న మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్లడం జరిగిందన్నారు.

దేశ ప్రజలందరికీ న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించిన మనభారత రాజ్యాంగం 1949, నవంబర్ 26న ఆమోదించబడిందని తెలిపారు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో చరిత్ర ఉందన్నారు. ప్రతీ సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముత్యం బాబు,యాదగిరి గౌడ్,గుర్రం సృజన్,మారోజు రమేష్,సురేందర్ పటేల్,రాజు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News