మకర సంక్రాంతికి అరణ్య..
దిశ, వెబ్‌డెస్క్: రానా దగ్గుబాటి బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. తను ప్రధాన పాత్రలో నటించిన ‘అరణ్య’ మూవీ రిలీజ్ గురించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. మకర సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. గిరిజన తెగకు చెందిన వృద్ధుడిగా కనిపించనున్న రానా.. ఆదివాసీలు, జంతుజాలం నివాసముంటున్న అడవిని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటం చేశాడు? ఇందులో ఏనుగు పాత్ర ఏంటి? అనేది కథ. The wait is over #Aranya at a […]
దిశ, వెబ్‌డెస్క్: రానా దగ్గుబాటి బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. తను ప్రధాన పాత్రలో నటించిన ‘అరణ్య’ మూవీ రిలీజ్ గురించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. మకర సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. గిరిజన తెగకు చెందిన వృద్ధుడిగా కనిపించనున్న రానా.. ఆదివాసీలు, జంతుజాలం నివాసముంటున్న అడవిని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటం చేశాడు? ఇందులో ఏనుగు పాత్ర ఏంటి? అనేది కథ.
The wait is over #Aranya at a theatre near you Sankranti 2021!! pic.twitter.com/8gndLg3Tyh
— Rana Daggubati (@RanaDaggubati) October 21, 2020
కరోనా మహమ్మారితో మన పోరాటం.. చాలా కాలంగా పెరుగుతున్న మానవ విధ్వంసంపై అడవులు ఎలా పోరాడుతున్నాయని మనకు చూపించిందని, ఇది ఎప్పుడు ఆగుతుంది? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసిన రానా.. అరణ్య సినిమా చూసి దీనిపై అవగాహన పెంచుకుందాం అని పిలుపునిచ్చారు. పొంగల్ 2021లో మీకు సమీపంలో ఉన్న థియేటర్‌లో సినిమా విడుదల అవుతుందని తెలిపాడు. ‘హాతి మేరా సాతి’గా హిందీలో, కాదన్‌గా తమిళ్‌లో వస్తున్న సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందనే ధీమాతో ఉంది మూవీ యూనిట్.
Fighting the pandemic has shown us that our forests have been fighting a growing pandemic of human destruction for a long time! When will this stop!? Lets create awareness with #Kaadan, releasing on Pongal 2021 only at a theatre near you!
@TheVishnuVishal #PrabhuSolomon pic.twitter.com/Fs8UwE64Ed— Rana Daggubati (@RanaDaggubati) October 21, 2020
కాగా విష్ణు విశాల్, పుల్కిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గా ఓంకార్ ప్రధాన పాత్రల్లో కనిపింబోతున్న సినిమాకు ప్రభు సాల్మన్ దర్శకులు. ఎరోస్ ఇంటర్నేషనల్ సినిమాను నిర్మించగా.. శంతను మోయిత్రా సంగీతం సమకూర్చారు.