ఆర్జీవీ ‘మర్డర్’ సినిమాకు చుక్కెదురు
దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ప్రణయ్ హత్య కేసు ఘటనపై ఆయన తాజాగా మర్డర్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మూవీ ట్రైలర్, ఓ సాంగ్ కూడా విడుదల చేశాడు. అయితే, ఈ సినిమాను విడుదల చేయొద్దు అంటూ దళిత సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రణయ్ భార్య అమృత నల్గొండ జిల్లా కోర్టులో సివిల్ దావా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన కోర్టు.. […]
దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ప్రణయ్ హత్య కేసు ఘటనపై ఆయన తాజాగా మర్డర్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మూవీ ట్రైలర్, ఓ సాంగ్ కూడా విడుదల చేశాడు. అయితే, ఈ సినిమాను విడుదల చేయొద్దు అంటూ దళిత సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రణయ్ భార్య అమృత నల్గొండ జిల్లా కోర్టులో సివిల్ దావా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన కోర్టు.. రామ్ గోపాల్ వర్మకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం ఈ నెల 11 వరకు గడువు ఇస్తూనే.. తదుపరి విచారణ 11వ తేదీకి వాయిదా వేసింది.