రామాయణం ఖాతాలో మరో రికార్డు

దిశ, వెబ్ డెస్క్: రామాయణం, మహాభారతం ఎన్ని సార్లు చూసిన, విన్నా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ క్వారంటైన్ పీరియడ్ లో ఆ పురాణా గాథలను మరోసారి కళ్లారా చూడాలనుకున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అందుకోసం ఎంతోమంది నెటిజన్లు రామాయణ్‌, మహాభారత్‌ సీరియల్స్‌ను పునఃప్రసారం చేయాలంటూ ట్విటర్‌ లో ప్రసార భారతికి రిక్వెస్ట్ చేశారు. వారి కోరిక మేరకు రామాయణ్‌, మహాభారత్ సీరియళ్లను దూరదర్శన్ మళ్లీ ప్రసారం చేస్తోంది. ఇటీవల శ్రీకృష్ణ ను […]

Update: 2020-05-01 01:36 GMT

దిశ, వెబ్ డెస్క్: రామాయణం, మహాభారతం ఎన్ని సార్లు చూసిన, విన్నా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ క్వారంటైన్ పీరియడ్ లో ఆ పురాణా గాథలను మరోసారి కళ్లారా చూడాలనుకున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అందుకోసం ఎంతోమంది నెటిజన్లు రామాయణ్‌, మహాభారత్‌ సీరియల్స్‌ను పునఃప్రసారం చేయాలంటూ ట్విటర్‌ లో ప్రసార భారతికి రిక్వెస్ట్ చేశారు. వారి కోరిక మేరకు రామాయణ్‌, మహాభారత్ సీరియళ్లను దూరదర్శన్ మళ్లీ ప్రసారం చేస్తోంది. ఇటీవల శ్రీకృష్ణ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ప్రసారభారతి. దూరదర్శన్‌లో 33 ఏళ్ల కిందట ప్రసారమైన రామాయణ, మహాభారత సీరియళ్లు ఓ చరిత్రను సృష్టించాయి. మరోసారి వస్తున్న ఈ సీరియళ్లు దూరదర్శన్ కు పునర్వవైభవాన్ని తీసుకు రావడమే కాకుండా.. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పున ప్రసారంలో భాగంగా ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన రామాయణ్‌ సీరియల్‌ తాజాగా మరో కొత్త రికార్డును తన పేరిట లిఖించుకొంది.

భారతీయ టీవీ ప్రేక్షకులకు రామాయణ ఇతిహాసాన్ని ఎంతో అద్భుతంగా చూపించిన సీరియల్‘రామాయణం’. వాల్మీకి రామాయణం, తులసీదాస్ ‘రామ్ చరిత్ మానస్’ ఆధారంగా ఈ సీరియల్ ను రామానంద్ సాగర్ రూపొందించారు. 1987, జనవరి 25న రామాయణం సీరియల్ దూరదర్శన్ చానల్ లో ప్రారంభమైంది. 78 ఎపిసోడ్లుగా వచ్చిన రామాయణ సీరియల్… 1988 జూలై 31 తో ముగిసింది. ఈ సీరియల్ ఎంత పెద్ద హిట్ అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకుల చూసిన ‘మైథాలాజికల్’ టీవీ సీరియల్ ఇదే. రామాయణం సీరియల్ 55 దేశాల్లో ప్రసారమైంది. 650 మిలియన్ ప్రేక్షకులు ఈ ఇతిహాసాన్ని చూశారు. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన పౌరాణిక ధారవాహికగా ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో రామాయణ్ చోటు దక్కించుకుంది. ఈ సీరియల్‌కు 82 శాతం వ్యూయర్ షిప్ వచ్చింది. భారతీయ సీరియళ్ల చరిత్రలో ఇదే ఇప్పటి వరకూ రికార్డ్. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 28 నుంచి డీడీలో టెలికాస్ట్‌ అవుతున్న ఈ సీరియల్‌ను ఆ రోజు ఉదయం ప్రసారమైన రామాయణం సీరియల్ ను 3.40 కోట్ల మంది చూడగా, సాయంత్రం ఎపిసోడ్ ను 4.50 కోట్ల మంది చూశారు. మరుసటి రోజు ఉదయం 4 కోట్ల మంది, సాయంత్రం ఎపిసోడ్ ను 5.10 కోట్ల మంది చూడడం విశేషం. ఇది గత కొన్నేళ్లుగా ప్రసారవుతున్న సీరియల్స్ లో ఈ స్థాయి ఆదరణ రామాయణానికే దక్కడం గమనార్హం. ఇప్పుడు ఆ రికార్డును కూడా ఆ సీరియలే బద్దలు కొట్టింది. రామాయణ్ సీరియల్ ను ఏప్రిల్‌ 16న 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు రీ టెలికాస్ట్‌లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధికంగా వీక్షించిన సీరియల్‌గా రామాయణ్‌ నిలిచింది. ఈ విషయాన్ని ప్రసారభారతి తన ట్విట్టర్‌లో గురువారం అధికారికంగా వెల్లడించింది. సీరియల్‌లో రామునిగా అరుణ్‌ గోవిల్‌, సీతగా దీపికా చిలాకియా, రావణునిగా అరవింద్ త్రివేది, హనుమాన్‌గా ధారాసింగ్‌ తదితరులు నటించారు.

tags: coronavirus, lockdown, dd, doordarshan, prasar bharati, ramayan, re telecast, record

Tags:    

Similar News