రాముడి ఖాతాలో తొలి డిపాజిట్ రామ్‌లల్లా హుండీ

అయోధ్యలో రామాలయం నిర్మాణంపై మరో ముందడుగు పడింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీనియర్ న్యాయవాది పరాశరన్ నేతృత్వంలో ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా నెల రోజుల తర్వాత అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గురువారం మధ్యాహ్నం ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరిట బ్యాంకు ఖాతాను తెరిచారు. జీరో బ్యాలెన్స్‌తో కరెంట్ ఖాతాను తెరవగా రామలల్లా ఆలయం హుండీలోని గత 15 రోజుల విరాళాలను డిపాజిట్ చేశారు. ఆ ఖాతాలో ఇదే తొలి […]

Update: 2020-03-05 07:51 GMT

అయోధ్యలో రామాలయం నిర్మాణంపై మరో ముందడుగు పడింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీనియర్ న్యాయవాది పరాశరన్ నేతృత్వంలో ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా నెల రోజుల తర్వాత అయోధ్యలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గురువారం మధ్యాహ్నం ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరిట బ్యాంకు ఖాతాను తెరిచారు. జీరో బ్యాలెన్స్‌తో కరెంట్ ఖాతాను తెరవగా రామలల్లా ఆలయం హుండీలోని గత 15 రోజుల విరాళాలను డిపాజిట్ చేశారు. ఆ ఖాతాలో ఇదే తొలి డిపాజిట్. మరోవైపు 27 ఏండ్ల క్రితం నాటి ఎస్‌బీఐ ఫైజాబాద్‌ శాఖ ఖాతాలోని నగదును కొత్త ఖాతాలోకి మళ్లించనున్నారు. ఈ ఖాతాను అయోధ్యలోని బాబ్రీ మసీదు ధ్వంసం తర్వాత రామాలయ నిర్మాణం కోసం తెరిచారు. భక్తుల నుంచి సేకరించిన విరాళాలను ఇందులో డిపాజిట్ చేశారు. ‘డివిజనల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పాత ఖాతాలో రూ. 10 కోట్ల వరకు నగదు ఉంది. ఆదాయపు పన్ను మినహాయింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను ట్రస్టు అందజేసిన తర్వాత కొత్త ఖాతాలోకి నగదు బదిలీ అవుతుంది’ అని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 1993, ఫిబ్రవరిలో ఎస్‌బీఐ ఫైజాబాద్ శాఖలో తొలి బ్యాంకు ఖాతాను డిప్యూటీ కమిషనర్ తెరిచారు. ప్రస్తుతం తెరిచిన కొత్త ఖాతా లావాదేవీలను ముగ్గురు ట్రస్టు సభ్యులు గోవింద్‌గిరి మహారాజ్, చంపత్‌రాయ్, డాక్టర్ అనిల్ మిశ్రా పర్యవేక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకు ఒక్కసారి విరాళాలను లెక్కించనున్నారు. ఇందుకోసం జిల్లా కోశాధికారి, ఎస్‌బీఐ బ్యాంకు అధికారులు, ఎగ్జిక్యుటివ్ మేజిస్ట్రేట్, బంగారు పని నైపుణ్యం గల వ్యక్తి విరాళాల లెక్కింపు చేపడుతారు. బంగారం రూపంలో వచ్చిన విరాళాలను ట్రెజరీ లాకర్‌‌కు తరలిస్తారు. నగదు రూపంలో వచ్చిన విరాళాలను అయోధ్య ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తారు.

Tags: ram temple, Ayodhya, bank account open

Tags:    

Similar News