రామ్ పోతినేని ఊరమాస్ సబ్జెక్ట్.. షూటింగ్ అప్‌డేట్
దిశ, సినిమా : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రంపై అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై లింగుసామి దర్శకత్వం వహిస్తున్న మూవీ బైలింగ్వల్‌గా రాబోతుండగా.. హీరో రామ్ ఫస్ట్ స్ట్రెయిట్ తమిళ్ సినిమా ఇదే కావడం విశేషం. పవర్‌ఫుల్ ఊరమాస్ సబ్జెక్ట్‌తో వస్తున్న మూవీ స్టోరీ రామ్‌కు వినిపించామని.. కథ వినగానే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారని తెలిపారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. రీసెంట్‌గా డైరెక్టర్ […]
దిశ, సినిమా : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రంపై అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై లింగుసామి దర్శకత్వం వహిస్తున్న మూవీ బైలింగ్వల్‌గా రాబోతుండగా.. హీరో రామ్ ఫస్ట్ స్ట్రెయిట్ తమిళ్ సినిమా ఇదే కావడం విశేషం. పవర్‌ఫుల్ ఊరమాస్ సబ్జెక్ట్‌తో వస్తున్న మూవీ స్టోరీ రామ్‌కు వినిపించామని.. కథ వినగానే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారని తెలిపారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి.
రీసెంట్‌గా డైరెక్టర్ ఫైనల్ నెరేషన్‌తో మరింత ఎగ్జైట్ అయిన రామ్.. సూపర్‌డూపర్ ఎనర్జీతో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. ఈనెల 12న హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని, ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయని వివరించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఆల్రెడీ ఒక లవ్‌సాంగ్ ట్యూన్ కంపోజింగ్ కంప్లీట్ అయిందని చెప్పారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.