తెలుగు హీరో బైలింగువల్ ప్రాజెక్ట్‌పై తమిళ నిర్మాత ఫిర్యాదు
దిశ, సినిమా : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బైలింగువల్ ప్రాజెక్ట్ చిక్కుల్లో పడింది. డైరెక్టర్ లింగుస్వామి ఇటీవలే స్టోరీ ఫైనల్ నెరేషన్ ఇచ్చాడని, షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని రామ్ ప్రకటించగా.. తాజాగా తమిళ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా కంప్లయింట్‌తో కథ అడ్డం తిరిగింది. ఆయన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్ర్యూసర్స్ కౌన్సిల్‌తో పాటు సౌత్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లోనూ డైరెక్టర్ లింగుస్వామిపై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. […]
దిశ, సినిమా : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బైలింగువల్ ప్రాజెక్ట్ చిక్కుల్లో పడింది. డైరెక్టర్ లింగుస్వామి ఇటీవలే స్టోరీ ఫైనల్ నెరేషన్ ఇచ్చాడని, షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని రామ్ ప్రకటించగా.. తాజాగా తమిళ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా కంప్లయింట్‌తో కథ అడ్డం తిరిగింది. ఆయన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్ర్యూసర్స్ కౌన్సిల్‌తో పాటు సౌత్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లోనూ డైరెక్టర్ లింగుస్వామిపై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో అడ్వాన్స్‌గా భారీ మొత్తంలో డబ్బు తీసుకున్న లింగుస్వామి.. తమ ప్రొడక్షన్ హౌస్‌లో సినిమాలు చేస్తానని హామీ ఇచ్చాడని తెలిపాడు. అయితే ఇప్పటివరకు ఒక్క సినిమా చేయకపోగా, ఆ డబ్బులు కూడా తిరిగివ్వలేదని ఆరోపించాడు. ఈ విషయం తేలకముందే ప్రస్తుతం హీరో రామ్‌తో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడని, దీనికి ఒప్పుకునేది లేదని వెల్లడించాడు. కాగా రామ్‌తో లింగుస్వామి చేయబోయే చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటించనుంది.