బాబాయిలాగే నీ మనసు బంగారం చరణ్
దిశ, సినిమా: 100 కోట్ల కొవిడ్-19 వ్యాక్సినేషన్ మైలురాయి దాటిన భారత్‌కు దేశవిదేశాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగ్‌నాథ్, సెయింట్ కిట్స్ ప్రధాని నెవిస్ తిమోతి, డొమినికన్ ప్రధాని రూస్‌వెల్ట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు గ్రెగరీ మీక్స్ లాంటి ప్రముఖులు నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవలను ఎక్కువమంది ప్రజలకు […]
దిశ, సినిమా: 100 కోట్ల కొవిడ్-19 వ్యాక్సినేషన్ మైలురాయి దాటిన భారత్‌కు దేశవిదేశాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగ్‌నాథ్, సెయింట్ కిట్స్ ప్రధాని నెవిస్ తిమోతి, డొమినికన్ ప్రధాని రూస్‌వెల్ట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు గ్రెగరీ మీక్స్ లాంటి ప్రముఖులు నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవలను ఎక్కువమంది ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో వెబ్‌సైట్ ప్రారంభించిన హీరో, నిర్మాత రామ్‌చరణ్ కూడా ఈ విషయంపై స్పందించారు. ‘భారతదేశం100 కోట్ల టీకాల చారిత్రాత్మక ఘనత సాధించడానికి సహకరించిన మా ఫ్రంట్‌లైన్ మెడికల్ టీమ్‌లకు సెల్యూట్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ‘నీ మనసు మీ బాబాయ్ పవన్ కళ్యాణ్‌లా బంగారం అన్నయ్య’ అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.