ఈ నెల 26 నుంచి అన్ని జిల్లాల్లో ర్యాలీలు

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక డిమాండ్​ చేసింది. లేదంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని స్పష్టం చేసింది. రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదించినందున అఖిల భారత రైతుల పోరాట సమన్వయ కమిటీ ఈనెల 27వ తేదిన తలపెట్టిన భారత్​ బంద్​కు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక మద్ధతు ఇస్తుందని మంగళవారం ఓ ప్రకటనను […]

Update: 2021-09-21 07:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక డిమాండ్​ చేసింది. లేదంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని స్పష్టం చేసింది. రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదించినందున అఖిల భారత రైతుల పోరాట సమన్వయ కమిటీ ఈనెల 27వ తేదిన తలపెట్టిన భారత్​ బంద్​కు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక మద్ధతు ఇస్తుందని మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన అన్ని జిల్లాలోని డివిజన్​ కేంద్రాల్లో సంఘీభావ ర్యాలీలను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది.

పెట్రోల్, గ్యాస్ ధరలను నియంత్రించలేకపోవడం వలన నిత్యావసర వస్తువుల ధరలు అదుపులేకుండా పెరుగుతున్నాయన్నది. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ, కేంద్రం కార్పోరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతుందని పేర్కొన్నది. ప్రభుత్వ రంగం పతనం వలన ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయి సామాజిక న్యాయానికి విఘాతం కలిగే అవకాశం ఉన్నదని స్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం తీసుకువచ్చి విద్యారంగంలో కేంద్రీకరణ, కార్పొరేటీకరణకు పూనుకుంటున్నది వెల్లడించింది.

కేంద్రం ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రజలకు నష్టం చేస్తుందని వివరించింది. ఈ నేపథ్యంలోనే రైతులు చేస్తున్న బంద్‌కు ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు వివరించింది. వచ్చే ఆదివారం జరగబోయే ర్యాలీల్లో ప్రతీఒక్కరూ పాల్గొని రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాలని ఐక్యవేదిక స్టీరింగ్​ కమిటీ కోరింది.

Tags:    

Similar News