రకుల్‌ప్రీత్ ‘సీడ్ సైక్లింగ్’ ఫాలో అయిపోదాం..

హీరోయిన్లు తమ అందం, ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. ‘అందంగా ఉంటేనే అవకాశాలు.. ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు’ కాబట్టి తిండి విషయంలో, ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. ఇక హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎక్సరైజ్, యోగా, ఫుడ్.. ఏ టైమ్‌లో ఏ పని చేయాలో ఆ పనే చేయాలని చెప్తుంది. ఈ మధ్యే వెజిటేరియన్‌గా మారిపోయిన రకుల్.. కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ‘సాటి జంతువులను బతకనిద్దాం’ అని పిలుపునిచ్చింది. అంతేకాదు […]

Update: 2020-06-13 02:57 GMT

హీరోయిన్లు తమ అందం, ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. ‘అందంగా ఉంటేనే అవకాశాలు.. ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు’ కాబట్టి తిండి విషయంలో, ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. ఇక హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎక్సరైజ్, యోగా, ఫుడ్.. ఏ టైమ్‌లో ఏ పని చేయాలో ఆ పనే చేయాలని చెప్తుంది. ఈ మధ్యే వెజిటేరియన్‌గా మారిపోయిన రకుల్.. కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ‘సాటి జంతువులను బతకనిద్దాం’ అని పిలుపునిచ్చింది. అంతేకాదు శాకాహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం సొంతమవుతుందని చెప్తోంది. ఈ క్రమంలోనే విత్తనాలు ఆరోగ్యానికి ఎంత మంచివో కూడా చెబుతోంది రకుల్.

నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు.. అవిసె, గుమ్మడికాయ గింజల సీడ్ సైక్లింగ్ ద్వారా బహు ప్రయోజనాలు ఉన్నాయని సెలవిస్తోంది అమ్మడు. హార్మోన్ల సమతుల్యతను పొందేందుకు ఇది ఉత్తమమైన మార్గం అని సలహా ఇస్తోంది. ముందుగా 14 రోజులు.. నువ్వులు, పొద్దుతిరుగుడు కాంబినేషన్ తీసుకోవాలని చెబుతున్న ఈ పంజాబీ భామ.. 15 నుంచి 30 రోజులు అవిసె, గుమ్మడి గింజలను ఆహారంలోభాగంగా తీసుకుంటే హెల్తీగా తయారవుతామని వెల్లడించింది.

Tags:    

Similar News