2020తో కష్టమే : రకుల్
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలం అవుతోంది. జనాలు బయటకు రాలేక.. వచ్చినా జీవనోపాధి లేక.. తిండి గింజలు కూడా కరువై చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. సినీ పరిశ్రమలో అయితే దాదాపు నాలుగు నెలలుగా పని లేదు. వర్కర్లకు జీవనోపాధి లేదు. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు మొదలు పెడుతున్నా.. యూనిట్‌లో ఒక్కరికి కరోనా వచ్చినా సరే చిత్రీకరణ నిలిపేస్తున్నారు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రకుల్. 2020 తొందరగా వెళ్లిపోతే బాగుండనిపిస్తోందని తెలిపింది. ఈ ఏడాది చాలా […]
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలం అవుతోంది. జనాలు బయటకు రాలేక.. వచ్చినా జీవనోపాధి లేక.. తిండి గింజలు కూడా కరువై చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. సినీ పరిశ్రమలో అయితే దాదాపు నాలుగు నెలలుగా పని లేదు. వర్కర్లకు జీవనోపాధి లేదు. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు మొదలు పెడుతున్నా.. యూనిట్‌లో ఒక్కరికి కరోనా వచ్చినా సరే చిత్రీకరణ నిలిపేస్తున్నారు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రకుల్. 2020 తొందరగా వెళ్లిపోతే బాగుండనిపిస్తోందని తెలిపింది. ఈ ఏడాది చాలా కష్టాలు తెచ్చిపెట్టిందని.. జనం ప్రతీ క్షణం భయపడుతూ బ్రతుకుతున్నారని చెప్పింది. కానీ ఇదంతా కూడా కేవలం మనుషులు చేసిన తప్పులే అని.. ఇప్పటికైనా ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని అభిప్రాయపడింది.
అయితే కరోనా నుంచి బయటపడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన రకుల్.. కొవిడ్ -19 విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. కానీ భవిష్యత్తులో మరిన్ని ప్రాణాంతక వైరస్‌లు అటాక్ చేసే అవకాశం ఉందని.. విపత్తులు, యుద్ధాలు ఇలా చాలా వాటితో పోరాడాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ విషయంలో ప్రాణాలు లెక్క చేయకుండా సరిహద్దులో దేశం కోసం పోరాడుతున్న జవాన్లను స్పూర్తిగా తీసుకోవాలని.. వారి కన్నా మనం చాలా సురక్షితంగా ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరింది.