ఇలా చేసి.. కేవలం నెల రోజుల్లోనే రూ. 900 కోట్లు సంపాదించిన రాకేశ్
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ మార్కెట్లు ఇటీవల భారీ లాభాలతో దూసుకెళ్తున్న తరుణంలో బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కేవలం నెల రోజుల్లో రెండు కంపెనీల ద్వారా రూ. 900 కోట్ల లాభాలను సాధించారు. స్టాక్ మార్కెట్లు వరుసగా రికార్డు లాభాలతో దూసుకెళ్తున్న వేళ అన్ని రంగాలు పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ కీలక మైలురాయి 60,000 మార్కును అధిగమించింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు నీరసించినప్పటికీ దాదాపు అన్ని కంపెనీలు రికార్డు గరిష్ఠాల వద్ద ట్రేడయ్యాయి. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ మార్కెట్లు ఇటీవల భారీ లాభాలతో దూసుకెళ్తున్న తరుణంలో బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కేవలం నెల రోజుల్లో రెండు కంపెనీల ద్వారా రూ. 900 కోట్ల లాభాలను సాధించారు. స్టాక్ మార్కెట్లు వరుసగా రికార్డు లాభాలతో దూసుకెళ్తున్న వేళ అన్ని రంగాలు పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ కీలక మైలురాయి 60,000 మార్కును అధిగమించింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు నీరసించినప్పటికీ దాదాపు అన్ని కంపెనీలు రికార్డు గరిష్ఠాల వద్ద ట్రేడయ్యాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో లాభాలు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు కలిసొచ్చింది. ఆయన పెట్టుబడుల ద్వారా నెల రోజుల వ్యవధిలో రెండు టాటా సంస్థకు చెందిన కంపెనీల నుంచి రూ. 900 కోట్ల లాభాలను చూశారు.
ముఖ్యంగా ఆయన పెట్టుబడులు పెట్టిన టాటా మోటార్స్ షేర్లు 13 శాతం, టైటాన్ షేర్లు 11.40 శాతం పెరగడంతో ఆయన సంపద అత్యధికంగా పెరిగింది. టాటా మోటార్స్ కంపెనీ షేర్ విలువ మెరుగ్గా రాణించడంతో ఒక్కో షేర్‌పై దాదాపు రూ. 44 లాభం రాగా, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రూ. 170 కోట్లు దక్కించుకున్నారు. అత్యధికంగా టైటాన్ షేర్ల ద్వారా ఆయనకు రూ. 729 కోట్లు వచ్చాయి.