నా ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు : రజినీ
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ట్వీట్‌ను డిలీట్ చేసింది ట్విట్టర్. దీంతో తన మెస్సేజ్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు రజినీ. 12 నుంచి 14 గంటల పాటు ప్రజలు బయటకు రాకుండా ఉంటే… కరోనాను అదుపుచేయొచ్చని చెప్పిన మాటలు.. కేవలం జనతా కర్ఫ్యూ రోజుకు మాత్రమే పరిమితం అన్నారు. ఆ ఒక్క రోజు గురించే ట్వీట్ చేశానని తెలిపాడు తలైవా. కానీ తన అభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ట్వీట్‌ను డిలీట్ చేసింది ట్విట్టర్. దీంతో తన మెస్సేజ్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు రజినీ. 12 నుంచి 14 గంటల పాటు ప్రజలు బయటకు రాకుండా ఉంటే… కరోనాను అదుపుచేయొచ్చని చెప్పిన మాటలు.. కేవలం జనతా కర్ఫ్యూ రోజుకు మాత్రమే పరిమితం అన్నారు. ఆ ఒక్క రోజు గురించే ట్వీట్ చేశానని తెలిపాడు తలైవా. కానీ తన అభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా ట్విట్టర్ తన ట్వీట్‌ను డిలీట్ చేసిందని తెలిపారు. ప్రతీ ఒక్కరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని… కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
కాగా ఏ విషయంలో అయినా ఒక మెస్సేజ్ తప్పుగా ప్రభావం చూపిస్తుందని… పరిణామాలు తీవ్రంగా మారుతాయి అనుకుంటేనే ఏ సోషల్ మీడియా యాజమాన్యం అయినా మెస్సేజ్‌లను డిలీట్ చేస్తుంది. రజినీ ప్రజలకు తప్పుడు మెస్సేజ్ ఇచ్చారని.. అందుకే డిలీట్ చేశారని విమర్శలు వెల్లువెత్తగా దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది రజినీ.
Tags: Rajinikanth, SuperStar, Talaiva, Twitter