రజనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపే ఆ మంచి ముహూర్తం
దిశ,సినిమా: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఈ విషయంపై స్పందించిన తలైవా.. చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు నన్ను వరిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అయితే ఈ సంతోషకరమైన సమయంలో నా గురువు కె. బాలచందర్ లేకపోవడం చాలా బాధగా ఉంది’ అని తెలిపారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన […]
దిశ,సినిమా: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఈ విషయంపై స్పందించిన తలైవా.. చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు నన్ను వరిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అయితే ఈ సంతోషకరమైన సమయంలో నా గురువు కె. బాలచందర్ లేకపోవడం చాలా బాధగా ఉంది’ అని తెలిపారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసిన రజనీ.. రేపు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజని తెలిపారు. ఎందుకంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడంతో పాటు తన కుమార్తె సౌందర్య విఘ్నేశ్ ఎంతో శ్రమించి సిద్ధం చేసిన ‘హూట్ యాప్’ను తాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రజనీకి ఈ అవార్డు ప్రకటించగా.. కొవిడ్ కారణంగా ప్రదానోత్సవం వాయిదా పడింది.