ఒరిజిన‌ల్‌ గ్యాంగ్‌స్ట‌ర్స్ ఒకచోట కలిసిన వేళ.. Rajinikanth

దిశ, వెబ్‌డెస్క్: చిత్రపరిశ్రమలో హీరోలందరికీ పోటీ ఉండడం సాధారణమే.. ఆ పోటీతత్వం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం. రియల్ లైఫ్ లో హీరోలందరూ కలిసికట్టుగా కనిపిస్తారు. ఇక టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు కు ఉన్న స్నేహితుల లిస్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రథమ  వరసలో ఉంటారు. వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది రజినీ అస్వస్థతకు గురైనప్పుడు మోహన్ బాబు ఎంతగా ఎమోషనల్ అయ్యారో తెలిసిన విషయమే. తలైవా […]

Update: 2021-05-21 02:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్రపరిశ్రమలో హీరోలందరికీ పోటీ ఉండడం సాధారణమే.. ఆ పోటీతత్వం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం. రియల్ లైఫ్ లో హీరోలందరూ కలిసికట్టుగా కనిపిస్తారు. ఇక టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు కు ఉన్న స్నేహితుల లిస్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రథమ వరసలో ఉంటారు. వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది రజినీ అస్వస్థతకు గురైనప్పుడు మోహన్ బాబు ఎంతగా ఎమోషనల్ అయ్యారో తెలిసిన విషయమే. తలైవా ఎప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ కి వచ్చినా మంచు వారి ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్లరు.

ఇక ఇటీవలే రజినీ ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం భాగ్యనగరానికి వచ్చారు. షూటింగ్ అనంతరం మోహన్ బాబు ఇంట్లో సేదతీరారు. ఆ సమయంలో ఇద్దరు స్నేహితులు కలిసి దిగిన ఫోటోలను మోహన్ బాబు కుమారుడు మంచి విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇద్దరు తెల్ల చొక్కా-పంచెలతో డైనమిక్ గా కనిపించారు. ఇక విష్ణు ఈ ఫోటోలను షేర్ చేస్తూ ‘ఒరిజిన‌ల్‌ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన వేళ‌..’ అంటూ పోస్ట్ చేశాడు. డైలాగ్ కింగ్ – సూపర్ స్టార్ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News