రాజస్థాన్ బౌలర్ ఇంట్లో మరో విషాదం
దిశ, వెబ్డెస్క్: రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలిసారి ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. ఇటీవల కరోనా బారీన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి తండ్రి కంజీభాయ్ సకారియా మరణించాడు. ఐపీఎల్లో వచ్చిన డబ్బులతోనే తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్న సకారియా.. తండ్రి మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తమ్ముడి ఆత్మహత్యను మరువక ముందే.. చేతన్ తండ్రిని కూడా కోల్పోవడం బాధాకరం. ఇదే ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ […]
దిశ, వెబ్డెస్క్: రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలిసారి ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. ఇటీవల కరోనా బారీన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి తండ్రి కంజీభాయ్ సకారియా మరణించాడు. ఐపీఎల్లో వచ్చిన డబ్బులతోనే తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్న సకారియా.. తండ్రి మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తమ్ముడి ఆత్మహత్యను మరువక ముందే.. చేతన్ తండ్రిని కూడా కోల్పోవడం బాధాకరం. ఇదే ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో అతడి తమ్ముడు రాహుల్ సకారియా మానసిక కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకున్నాడు. పేదరికం నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థికంగా మెరుగుపడుతున్న చేతన్ సకారియాకు ఇలా జరగడం దారుణమని నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.