కమ్మిన్స్ కుమ్మేశాడు.. రాజస్తాన్ 37/5
దిశ, వెబ్‌డెస్క్: 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ జట్టు ఆదిలోనే కుప్పకూలింది. కోల్‌కతా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ రాజస్తాన్ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించాడు. వచ్చిన వారిని వచ్చినట్టే మైదానం వీడేలా చేశాడు. తొలి పవర్ ప్లే లోనే మూడు ఓవర్లు వేసిన కమ్మిన్స్ 29 పరుగులైతే ఇచ్చాడు కానీ.. ఏకంగా 4 కీలక వికెట్లను తీసుకున్నాడు. 2 బంతులు ఆడి 1 సిక్సర్ కొట్టిన రాబిన్ ఉతప్ప 19 స్కోర్ బోర్డు […]
దిశ, వెబ్‌డెస్క్: 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ జట్టు ఆదిలోనే కుప్పకూలింది. కోల్‌కతా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ రాజస్తాన్ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించాడు. వచ్చిన వారిని వచ్చినట్టే మైదానం వీడేలా చేశాడు. తొలి పవర్ ప్లే లోనే మూడు ఓవర్లు వేసిన కమ్మిన్స్ 29 పరుగులైతే ఇచ్చాడు కానీ.. ఏకంగా 4 కీలక వికెట్లను తీసుకున్నాడు. 2 బంతులు ఆడి 1 సిక్సర్ కొట్టిన రాబిన్ ఉతప్ప 19 స్కోర్ బోర్డు వద్ద ఔట్ చేశాడు. ఆ తర్వాత 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి 18 పరుగులు చేసి కుదురుకుంటున్న బెన్ స్టోక్స్‌ను కూడా 27 పరుగుల వద్దనే క్యాచ్ ఔట్ చేశాడు.
ఇక ఈ వికెట్‌తో ఒత్తిడికి గురైన రాజస్తాన్ ఆటగాళ్లు వికెట్లు వదిలేశారు. వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ (4)లకే కమ్మిన్స్ క్లీన్ బోల్డ్ చేయగా.. సంజుశాంసన్(1) పరుగు చేసి శివం మావి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 32 పరుగులకే RR నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. ఇక ఆ తర్వాతి స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్(0)ను కూడా కమ్మిన్స్ డకౌట్ చేశాడు. దీంతో 37 పరుగులకే రాజస్తాన్ రాయల్స్ జట్టు ఏకంగా 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి పవర్ ప్లే ముగిసే సరికి క్రీజులో జోస్ బట్లర్(7), రాహుల్ తెవాతియా(3) పరుగులు చేసి ఉన్నారు.