రాష్ట్రవ్యాప్తంగా వానలు
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వానలు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు 20జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 51.5 మి.మి. వర్షం కురిసింది. అదేవిధంగా మెదక్ జిల్లాలో 48.8, సిద్ధిపేట జిల్లాలో 42.8, నిజామాబాద్ జిల్లాలో 39మి.మి. వర్షం పడింది. అత్యధిక వర్షపాతం 51.5 మి.మి. ఉండగా అత్యల్పంగా 28.0 మి.మి. కురిసింది. గ్రేటర్ పరిధిలో శేరిలింగంపల్లిలో 66.8 మి.మి. నమోదైంది. మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో వర్షం కురిసింది. కాగా […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వానలు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు 20జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 51.5 మి.మి. వర్షం కురిసింది. అదేవిధంగా మెదక్ జిల్లాలో 48.8, సిద్ధిపేట జిల్లాలో 42.8, నిజామాబాద్ జిల్లాలో 39మి.మి. వర్షం పడింది. అత్యధిక వర్షపాతం 51.5 మి.మి. ఉండగా అత్యల్పంగా 28.0 మి.మి. కురిసింది. గ్రేటర్ పరిధిలో శేరిలింగంపల్లిలో 66.8 మి.మి. నమోదైంది. మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో వర్షం కురిసింది. కాగా శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.