అక్టోబర్ అంటే… వణికిపోతున్న కోనసీమ
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రజలు అక్టోబర్ నెల అంటనే భయంతో వణికిపోతున్నారు. ప్రతి ఏడాదిలో ఈ నెలలోనే కోనసీమలో భారీ వర్షాలు పడి అల్లకల్లోలం సృష్టిస్తోంది. అందులో 2013 అక్టోబర్ 11న ఫైలిన్ తుఫాన్, 2014లో హుద్‌హుద్ తుఫాన్ అలజడి, 2018 అక్టోబర్‌లో తితిలీ తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే 2020లో ఏం విపత్తు సంభవిస్తుందో అని కోనసీమ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఇప్పటికే కరోనా మహమ్మారి […]
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రజలు అక్టోబర్ నెల అంటనే భయంతో వణికిపోతున్నారు. ప్రతి ఏడాదిలో ఈ నెలలోనే కోనసీమలో భారీ వర్షాలు పడి అల్లకల్లోలం సృష్టిస్తోంది. అందులో 2013 అక్టోబర్ 11న ఫైలిన్ తుఫాన్, 2014లో హుద్‌హుద్ తుఫాన్ అలజడి, 2018 అక్టోబర్‌లో తితిలీ తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే 2020లో ఏం విపత్తు సంభవిస్తుందో అని కోనసీమ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఇప్పటికే కరోనా మహమ్మారి మూలంగా అతలాకుతలం అయిన జనజీవనం, మళ్లీ ఏదైనా భారీ తుఫాన్ వచ్చిందంటే కోలుకోవడం కూడా కష్టమే అని కోనసీమ వాసులు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు.