మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రజల అవస్థలు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: అర్ధరాత్రి కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా వర్షం కారణంగా పెద్ద చెరువులోని నీరు బయటకు రావడంతో జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలి వీధిలోని ఇళ్లల్లోకి వర్షపు వచ్చి చేరింది. దీంతో ఆ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానిక యువకులే స్వచ్ఛందంగా నీటిని ఎత్తిపోస్తున్నారు. అలాగే జిల్లా పరిషత్ మైదానంలో కూడా వర్షపు వచ్చి చేరింది. దీంతో జిల్లా పరిషత్ మైదానం […]

Update: 2020-07-02 22:01 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: అర్ధరాత్రి కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా వర్షం కారణంగా పెద్ద చెరువులోని నీరు బయటకు రావడంతో జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలి వీధిలోని ఇళ్లల్లోకి వర్షపు వచ్చి చేరింది. దీంతో ఆ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానిక యువకులే స్వచ్ఛందంగా నీటిని ఎత్తిపోస్తున్నారు. అలాగే జిల్లా పరిషత్ మైదానంలో కూడా వర్షపు వచ్చి చేరింది. దీంతో జిల్లా పరిషత్ మైదానం చెరువును తలపిస్తుంది.

Tags:    

Similar News