ఆన్‌లైన్‌లో రైల్వే స్మార్ట్‌కార్డు రీచార్జ్

దిశ, తెలంగాణ బ్యూరో : స్మార్టు కార్డులో డబ్బులు అయిపోతే ప్రయాణికులు రీచార్జీ కోసం ప్రతి సారి బుకింగ్ కౌంటర్లకు రావల్సి వచ్చేదని, వారి ఇబ్బందులను తొలగించేందుకు డిజిటల్ పద్ధతిలో రీచార్జీ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌, యూపీఐ వంటి అన్ని డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం ఉందన్నారు. అన్‌రిజర్వుడ్‌ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా […]

Update: 2021-08-06 11:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : స్మార్టు కార్డులో డబ్బులు అయిపోతే ప్రయాణికులు రీచార్జీ కోసం ప్రతి సారి బుకింగ్ కౌంటర్లకు రావల్సి వచ్చేదని, వారి ఇబ్బందులను తొలగించేందుకు డిజిటల్ పద్ధతిలో రీచార్జీ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌, యూపీఐ వంటి అన్ని డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం ఉందన్నారు. అన్‌రిజర్వుడ్‌ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఆటోమెటిక్‌ టికెట్‌ వెండిరగ్‌ మెషిన్స్‌ (ఏటీవీఎమ్‌లు) ద్వారా కొనే సౌలభ్యాన్ని కలిగించిందన్నారు.

స్మార్ట్‌ కార్డులు కలిగి ఉన్న రైలు వినియోగదారులు వెబ్‌ పోర్టల్‌లో యూటీఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో వారి కార్డులను రీచార్జీ చేసుకోవచ్చని సూచించారు. ప్రయాణికులు టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్‌ కార్డు రీచార్జీ చేసుకోవాలని కోరారు. కోవిడ్‌ మహమ్మారి కాల పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ రీచార్జీ సౌకర్యం స్వాగతించాల్సిన అంశమని, ప్రయాణికుల విలువైన సమయాన్ని ఆదా చేస్తుందని అన్నారు. ఈ ఆన్‌లైన్‌ సౌలభ్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని, దీంతో వారు ప్రతిసారి యూటీఎస్‌ కౌంటర్ల వద్దకు రావాల్సిన అవసరం ఉండదన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..