రైల్వే ప్రయాణికులకు షాక్.. ప్రతి రోజు ఆ ఆరు గంటలు రిజర్వేషన్లు బంద్..

దిశ, వెబ్ డెస్క్ : రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ కొన్ని సూచనలు చేసింది. సాఫ్ట్ వేర్ అప్డేట్ లో భాగంగా వారం రోజుల పాటు రిజర్వేషన్, ఎంక్వైరీ, టికెట్ రద్దు లాంటి సేవలకు అంతరాయం కలగనుంది. కరోనా కాలంలో చాలా వరకూ ట్రైన్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత పరిస్థితులు చక్కబడుతున్నా కొద్దీ రైళ్ల సంఖ్య పెంచుతూ వచ్చారు. ట్రైన్లకు నంబర్లు ఇవ్వడంలో చాలా సార్లు సమస్యలు వచ్చాయి. ఎలాగోలా ఏడాది నడిపించారు. ఇక రైళ్ల […]

Update: 2021-11-15 02:36 GMT

దిశ, వెబ్ డెస్క్ : రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ కొన్ని సూచనలు చేసింది. సాఫ్ట్ వేర్ అప్డేట్ లో భాగంగా వారం రోజుల పాటు రిజర్వేషన్, ఎంక్వైరీ, టికెట్ రద్దు లాంటి సేవలకు అంతరాయం కలగనుంది. కరోనా కాలంలో చాలా వరకూ ట్రైన్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత పరిస్థితులు చక్కబడుతున్నా కొద్దీ రైళ్ల సంఖ్య పెంచుతూ వచ్చారు. ట్రైన్లకు నంబర్లు ఇవ్వడంలో చాలా సార్లు సమస్యలు వచ్చాయి. ఎలాగోలా ఏడాది నడిపించారు. ఇక రైళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుండటంతో సాఫ్ట్ వేర్ అప్డేట్ మాత్రమే మార్గంగా కనిపిస్తోంది. అందుకోసం ఈ అంతరాయం తప్పదు అని రైల్వేశాఖ ప్రకటించింది.

ప్రత్యేకం పేరుతో ట్రైన్లు నడుస్తుండటం వల్ల ప్రయాణికుల పై కూడా భారం పెరిగింది. ఇంకా కొన్ని మార్గాల్లో సాధారణ రైళ్లు కూడా ప్రారంభం కాలేదు. దానికి తోడు రైళ్ల నంబర్లు, స్టేషన్ల హాల్టింగ్, చార్జీల విషయంలో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది.

ఎప్పుడెప్పుడు పనిచేయదంటే ?

సాఫ్ట్ వేర్ పనులను నవంబర్ 14 నుంచి మొదలు పెట్టనున్నారు. ఇది 22 వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ తేదీల్లో ప్రతి రోజూ రాత్రి 11.30 నుంచి తర్వాతి రోజు ఉదయం 5.30 వరకూ అంటే ఆరు గంటల పాటూ రిజర్వేషన్ సేవలు అన్నీ బంద్ అవుతాయి. ఈ సమయంలో టికెట్లు బుక్ చేయడం, పీఎన్ఆర్ స్టేటస్ , టికెట్లు రద్దు చేయడం, ట్రైన్ రియల్ టైం సేవలు, కరెంట్ బుకింగ్ స్టేటస్ లాంటి సేవలన్నీ నిలిచిపోనున్నాయి. తిరిగి సేవలు పునరుద్ధరించే వరకూ ప్రయాణీకులు సహకరించాలని రైల్వేశాఖ కోరింది.

Tags:    

Similar News