ఇప్పుడు ఆ మహిళా ఏఎస్సైని దేశమంతటా మెచ్చుకుంటున్నారు

దిశ, వెబ్ డెస్క్: “నేను కూడా ఓ తల్లినే.. ఆ బాధేంటో నాకు తెలుసు. అందుకే ఆ విధంగా చేశాను” అంటూ ఓ మహిళా ఏఎస్సై చెప్పుకొచ్చింది. ఇప్పుడామెను దేశమంతటా ప్రశంసిస్తున్నారు. రైల్వే కూడా ప్రత్యేకంగా మెచ్చుకుంది. ఎందుకో తెలుసుకుందామా..? అయితే మీరు ఈ స్టోరీని చదవాల్సిందే. విషయమేమంటే.. బెంగళూరు నుంచి గోరఖ్ పూర్ కు ఓ ప్రత్యేక రైలు బయలుదేరింది. ఆదివారం ఉదయం 6 గంటలకు హతియా రైల్వే స్టేషన్ లో కొంతసేపు ఆగిపోయింది. దీంతో […]

Update: 2020-06-17 00:10 GMT

దిశ, వెబ్ డెస్క్: “నేను కూడా ఓ తల్లినే.. ఆ బాధేంటో నాకు తెలుసు. అందుకే ఆ విధంగా చేశాను” అంటూ ఓ మహిళా ఏఎస్సై చెప్పుకొచ్చింది. ఇప్పుడామెను దేశమంతటా ప్రశంసిస్తున్నారు. రైల్వే కూడా ప్రత్యేకంగా మెచ్చుకుంది. ఎందుకో తెలుసుకుందామా..? అయితే మీరు ఈ స్టోరీని చదవాల్సిందే.

విషయమేమంటే..

బెంగళూరు నుంచి గోరఖ్ పూర్ కు ఓ ప్రత్యేక రైలు బయలుదేరింది. ఆదివారం ఉదయం 6 గంటలకు హతియా రైల్వే స్టేషన్ లో కొంతసేపు ఆగిపోయింది. దీంతో అక్కడ దిగవల్సినవాళ్లు దిగిపోయారు. ఈ సమయంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే.. ఆ రైలులో ప్రయాణం చేస్తున్న ఓ మహిళ చేతుల్లో పసిబిడ్డ ఏడుస్తూ ఉంది. దీంతో ఆ మహిళ ఎలాగైనా తన బిడ్డకు పాలు తాపించి ఆకలి తీర్చాలనుకుంది. వెంటనే అటు వైపు చూసింది. అక్కడే నిల్చుని ఉన్న ఆర్పీఎఫ్ మహిళా ఏఎస్సై సుశీలా(సుశీలా బడాయిక్) కనిపించింది. దీంతో వెంటనే రైలులో నుంచి ఆమెను సంప్రదించింది. ‘మేడం నా బిడ్డ ఆకలితో ఏడుస్తున్నది. ఇక్కడెక్కడైనా పాలు దొరికితే కొద్దిగా సమకూర్చగలరా’ అని రిక్వెస్ట్ చేసింది. వెంటనే ఆ మహిళా ఏఎస్సై స్పందించి తన ఇంటికి ఊరికింది. తన పిల్లల కోసం ఉంచిన పాలను వేడి చేసి తీసుకొనివచ్చి ఆ తల్లికి ఇచ్చింది. దీంతో ఆమె ఆ పాలను తన బిడ్డకు తాపించి.. ఆకలి తీర్చింది. అనంతరం ఆ మహిళా ఏఎస్సైకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ మహిళా ఏఎస్సైని మెచ్చుకుంటున్నారు. నువ్ గొప్ప పని చేశావంటూ ఆమెను పొగుడుతున్నారు. ఈ విషయమై ఆమెను అడుగగా.. ‘ఆ చంటి పాప ఏడుస్తుంటే నాకు బాధగా అనిపించింది. అంతేకాదు.. నేను కూడా ఓ తల్లినే కదా. అందుకే నా పిల్లల కోసం దాచి ఉంచిన పాలను తీసుకొచ్చి ఇచ్చాను’ అని చెప్పింది. ఇప్పుడామెను దేశమంతా మెచ్చుకుంటున్నారు. రైల్వేశాఖ కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించింది.

Tags:    

Similar News