వ్యాక్సిన్ తీసుకున్నాక పాజిటివ్.. రాయికోడ్ ఎంపీపీ మృతి

దిశ, ఆందోల్: కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా రాయికోడ్ ఎంపీపీ వెంకట్రావు పాటిల్ మంగళవారం తెల్లవారుజామున కరోనాతో మృతి చెందారు. మృతుడు ఈ నెల 15న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 23న సంగారెడ్డిలోని సన్ షైన్ ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. వీఆర్వోగా రిటైర్డ్ అయ్యాక కాంగ్రెస్ […]

Update: 2021-04-27 06:14 GMT

దిశ, ఆందోల్: కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా రాయికోడ్ ఎంపీపీ వెంకట్రావు పాటిల్ మంగళవారం తెల్లవారుజామున కరోనాతో మృతి చెందారు. మృతుడు ఈ నెల 15న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 23న సంగారెడ్డిలోని సన్ షైన్ ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు.

వీఆర్వోగా రిటైర్డ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరి 2016లో ఎంపీపీగా గెలుపొందాడు. కాగా, 2019 ఎంపీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరి 2020లో రెండోసారి ఎంపీపీగా ఎన్నికయ్యారు. అందరితో కలుపుగోలుగా వుండే వెంకట్రావు పాటిల్ మృతి పట్ల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు తమ సంతాపం ప్రకటించడంతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Tags:    

Similar News