సరిహద్దు గొడవలకు కేంద్రం కారణం

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. గురువారం తన ట్విట్టర్‌ అకౌంట్‌లో మోదీని విమర్శిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రధాని కేవలం తన ప్రతిష్టను కాపాడుకోవడానికే 100 శాతం దృష్టిపెట్టారని చెప్పుకొచ్చారు. దీని కోసం కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఒక వ్యక్తి ప్రతిష్టను జాతీయ విజన్‌కు ప్రత్యమ్నాయం కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అటు చైనా-గాల్వన్ లోయ ఘర్షణపై స్పందించిన రాహుల్ గాంధీ.. సరైన ప్రణాళిక లేకుండా […]

Update: 2020-07-23 09:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. గురువారం తన ట్విట్టర్‌ అకౌంట్‌లో మోదీని విమర్శిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రధాని కేవలం తన ప్రతిష్టను కాపాడుకోవడానికే 100 శాతం దృష్టిపెట్టారని చెప్పుకొచ్చారు. దీని కోసం కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఒక వ్యక్తి ప్రతిష్టను జాతీయ విజన్‌కు ప్రత్యమ్నాయం కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

అటు చైనా-గాల్వన్ లోయ ఘర్షణపై స్పందించిన రాహుల్ గాంధీ.. సరైన ప్రణాళిక లేకుండా చైనాను ఢీ కొట్టలేమని చెప్పుకొచ్చారు. చైనాను ఎదుర్కొవడంలో మోదీ సరైన ప్రణాళిక అనుసరించడం లేదని విమర్శించారు. మనం బలహీనంగా కనిపించడంతోనే చైనా హద్దు దాటుతోందని అభిప్రాయపడ్డారు. మనం గట్టిగా నిలబడితేనే చైనా ఎదుర్కొవచ్చని స్పష్టం చేశారు. ప్రధాని అనుసరిస్తున్న తీరును మార్చుకుంటేనే ఇది సాధ్యమవుతోందిని రాహుల్ గాంధీ వీడియో ద్వారా తెలిపారు. సరిహద్దులో జరిగే గొడవలకు కేంద్ర ప్రభుత్వం కారణమని ఆయన ఆరోపించడం గమనార్హం.

Tags:    

Similar News