సచిన్ నీడలో ద్రవిడ్ మరుగునపడ్డాడు: గంభీర్

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్‌కు రాహుల్ ద్రవిడ్ చేసిన సేవలు అమోఘమని, సచిన్ వంటి లెజండరీ క్రికెటర్ నీడలో అతని సేవలను మనం గుర్తించలేకపోయామని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. క్రికెట్‌ను అత్యంత ప్రభావితం చేసిన భారత క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్ ముందు వరుసలో ఉంటాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. మనం ఎప్పుడూ గంగూలీ, ఎంఎస్ ధోనీ గురించే మాట్లాడుకుంటాం. కానీ, ద్రవిడ్ చేసిన సేవలను విస్మరించకూడదని ఆయన అన్నాడు. ‘నేను గంగూలీ కెప్టెన్సీలోనే వన్డే అరంగేట్రం […]

Update: 2020-06-22 07:29 GMT

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్‌కు రాహుల్ ద్రవిడ్ చేసిన సేవలు అమోఘమని, సచిన్ వంటి లెజండరీ క్రికెటర్ నీడలో అతని సేవలను మనం గుర్తించలేకపోయామని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. క్రికెట్‌ను అత్యంత ప్రభావితం చేసిన భారత క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్ ముందు వరుసలో ఉంటాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. మనం ఎప్పుడూ గంగూలీ, ఎంఎస్ ధోనీ గురించే మాట్లాడుకుంటాం. కానీ, ద్రవిడ్ చేసిన సేవలను విస్మరించకూడదని ఆయన అన్నాడు. ‘నేను గంగూలీ కెప్టెన్సీలోనే వన్డే అరంగేట్రం చేసిన, టెస్టు క్రికెట్ అరంగేట్రం ద్రవిడ్ నాయకత్వంలో జరిగింది. అతడిని నేను చాలా దగ్గర నుంచి గమనించా. ఒక బ్యాట్స్‌మాన్, కీపర్, కెప్టెన్‌గా బహుముఖ పాత్రలు పోషించాడు. కానీ, ద్రవిడ్‌కు రావల్సిన గుర్తింపు రాలేదు. దానికి అతను సచిన నీడిలో మిగిలిపోవడమే. భారత క్రికెట్‌లో రాహుల్ ద్రవిడే ప్రతిభావంతమైన కెప్టెన్’ అని గౌతమ్ గంభీర్ అన్నాడు. ద్రవిడ్ కేవలం బ్యాట్స్‌మాన్ గానే కాకుండా కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించిన విషయాన్ని గుర్తు చేశాడు.

Tags:    

Similar News