పాటను పాడుచేసిన వారిపై రెహమాన్ మండిపాటు

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో రీమిక్స్ పాటలు రావడం చాలా కామన్ అయిపోయింది. పాత హిట్ పాటలకు కొద్దిగా హిప్ హాప్ జోడించి, పాట ట్యూన్‌లో కొన్ని మార్పులు చేసి రీమిక్స్‌లు చేయడం పరిపాటిగా మారిపోయింది. అయితే అన్ని రీమిక్సులు అనుకున్నట్లుగా రావు కదా… ఇటీవల విడుదలైన మసక్కలి 2.0 పాట విషయంలో కూడా అదే జరిగింది. ఢిల్లీ 6 సినిమా కోసం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన మసక్కలి పాట ఒక క్లాసిక్. చాలా పీస్‌ఫుల్‌గా ఉండే […]

Update: 2020-04-08 23:49 GMT

దిశ, వెబ్‌డెస్క్:
బాలీవుడ్‌లో రీమిక్స్ పాటలు రావడం చాలా కామన్ అయిపోయింది. పాత హిట్ పాటలకు కొద్దిగా హిప్ హాప్ జోడించి, పాట ట్యూన్‌లో కొన్ని మార్పులు చేసి రీమిక్స్‌లు చేయడం పరిపాటిగా మారిపోయింది. అయితే అన్ని రీమిక్సులు అనుకున్నట్లుగా రావు కదా… ఇటీవల విడుదలైన మసక్కలి 2.0 పాట విషయంలో కూడా అదే జరిగింది. ఢిల్లీ 6 సినిమా కోసం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన మసక్కలి పాట ఒక క్లాసిక్. చాలా పీస్‌ఫుల్‌గా ఉండే ఈ పాటను సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుటారియాలతో తనిష్క్ బాగ్చీ ఆల్బం వీడియో తీశాడు. అయితే ఈ రీమిక్స్ గురించి ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరు. మంచి పాటను చెడగొట్టారు, వింటుంటే చెవుల్లో నుంచి రక్తం వస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే ఇదే పాట గురించి ఏఆర్ రెహమాన్ కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. సాధారణంగా తన పాటల రీమిక్స్‌లను స్వాగతించే రెహమాన్ మొదటిసారి ఇలా స్పందించడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…

‘ఎలాంటి షార్ట్‌కట్స్ లేవు, ఎన్నో నిద్రలేని రాత్రులు, 200 మంది సంగీతకారులు, 365 రోజుల సృజనాత్మక మేధోమథనం కలిస్తే తరాల పాటు నిలిచే సంగీతం తయారవుతుంది. వీరితో పాటు డైరెక్టర్, కంపోజర్, లిరిసిస్ట్, యాక్టర్లు, డ్యాన్స్ డైరెక్టర్లు, చిత్ర బృందానికి నా ప్రేమ, ప్రార్థనలు’ అని రెహమాన్ పోస్ట్ చేశారు. అయితే దీనికి క్యాప్షన్‌గా ఎంజాయ్ ది ఒరిజినల్ సాంగ్ అని మసక్కలి పాట లింకుని పోస్ట్ చేశారు. ఆయన పోస్టు చాలా అసహనంగా కనిపించడంతో నెటిజన్లు మసక్కలి 2.0 మీద కామెంట్లు, డిస్‌లైకుల వర్షం కురిపించారు. గతంలో తన హమ్మ హమ్మ పాట రీమిక్స్‌ను రెహమాన్ పొగిడిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News