లక్కీ డ్రా పేరుతో 5 వేల మందికి టోపి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో రోజుకో చోట లక్కీ డ్రాల బాధితులు బయటకు వస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌కు చెందిన రహామాన్ ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులు సుమారు 5 వేల మందికి కుచ్చు టోపి పెట్టారు. కరోనా కారణం చెప్పి రెండు నెలలుగా దుకాణం మూసిన నిర్వాహకులు చివరకు బోర్డు తిప్పేశారు. దాంతో సభ్యులుగా నమోదు చేయించిన ఏజంట్లను ప్రజలు నిలదీయడం మొదలు పెట్టారు. వారు, బాధితులు కలిసి పెర్కిట్‌లోని హబీబ్-ఉల్-రహామాన్ ఇంటికి వెళ్లగా […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో రోజుకో చోట లక్కీ డ్రాల బాధితులు బయటకు వస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌కు చెందిన రహామాన్ ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులు సుమారు 5 వేల మందికి కుచ్చు టోపి పెట్టారు. కరోనా కారణం చెప్పి రెండు నెలలుగా దుకాణం మూసిన నిర్వాహకులు చివరకు బోర్డు తిప్పేశారు. దాంతో సభ్యులుగా నమోదు చేయించిన ఏజంట్లను ప్రజలు నిలదీయడం మొదలు పెట్టారు. వారు, బాధితులు కలిసి పెర్కిట్‌లోని హబీబ్-ఉల్-రహామాన్ ఇంటికి వెళ్లగా కనిపించకుండా పోయాడు. దాంతో బాధితులు లబోదిబో మంటున్నారు.
రహామాన్ 20 నెలల క్రితం లక్కీ డ్రా పేరిట 3600, 1500 మంది సభ్యులతో లక్కీ డ్రాను ఇటీవల ప్రారంభించినట్లు తెలిసింది. వేల్పూర్‌కు చెందిన వ్యక్తికి లక్కీ డ్రాలో కారు రాగా, అతన్ని రేపుమాపు అని తిప్పించడం మొదలుపెట్టాడు. దానికి తోడు మిగిలిన బాధితులు తమకు వచ్చిన లక్కీ డ్రాలోని సామాగ్రి ఇవ్వమని ఒత్తిడి తేగా తప్పించుకొని తిరుగుతున్నాడు.
సోమవారం బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆర్మూర్‌తో పాటు జగిత్యాల జిల్లాలో రహామాన్ బాధితులు ఉన్నారు. సుమారు 5 కోట్ల వరకు డబ్బులు వసూల్ చేసిన నిర్వాహకులపై ఆర్మూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేస్తే, మీరేందుకు లక్కీ డ్రాలు కట్టాలి, ఎందుకు మోసపోవాలని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చారని బాధితులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 10 వరకు లక్కీ డ్రా నిర్వాహకులు బోర్డులు తిప్పేసి నిండా ముంచారు.