షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా షూటర్ రాహి సర్నోబత్ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నది. క్రొయేషియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో సోమవారం 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రాహి స్వర్ణం గెలవగా.. మను భాకర్ ఏడోస్థానంతో సరిపెట్టుకున్నది. ప్రపంచ వరల్డ్ కప్‌లో ఇప్పటికే ఒక వెండి, రెండు కాంస్య పతకాలు భారత్ గెలుచుకోగా.. తొలి స్వర్ణాన్ని రాహి అందించింది. క్వాలిఫయింగ్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన రాహి.. ఫైనల్‌లో మాత్రం అద్భుత […]

Update: 2021-06-28 10:58 GMT

దిశ, స్పోర్ట్స్: భారత మహిళా షూటర్ రాహి సర్నోబత్ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నది. క్రొయేషియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో సోమవారం 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రాహి స్వర్ణం గెలవగా.. మను భాకర్ ఏడోస్థానంతో సరిపెట్టుకున్నది. ప్రపంచ వరల్డ్ కప్‌లో ఇప్పటికే ఒక వెండి, రెండు కాంస్య పతకాలు భారత్ గెలుచుకోగా.. తొలి స్వర్ణాన్ని రాహి అందించింది. క్వాలిఫయింగ్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన రాహి.. ఫైనల్‌లో మాత్రం అద్భుత ప్రదర్శన చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన మథిదే రామొల్లే రజత పతకాన్ని గెలుచుకున్నది. ఇక క్వాలిఫయింగ్ పోటీల్లో 3వ స్థానంలో నిలిచిన భాకర్ ఫైనల్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. కేవలం 11 పాయింట్లు గెలిచి ఫైనల్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

Tags:    

Similar News