బిగ్ బ్రేకింగ్: రఘురామకృష్ణకు బెయిల్ మంజూరు
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఇటీవల సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షరుతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రఘురామ విచారణకు సహకరించాలని ఆదేశించింది. విచారణకు 24గంటల ముందే నోటీసు ఇవ్వాలని సీఐడీకి సూచించింది. అంతేకాకుండా రఘురామ సోషల్‌మీడియా, మీడియా ముందుకు రాకూడదని, ఈ కేసుకు సంబంధించి ఏమి మాట్లాడకూడదని స్పష్టం చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీని వారంలోపు ట్రయల్ కోర్టులో సమర్పించాలన్న […]
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఇటీవల సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షరుతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రఘురామ విచారణకు సహకరించాలని ఆదేశించింది. విచారణకు 24గంటల ముందే నోటీసు ఇవ్వాలని సీఐడీకి సూచించింది. అంతేకాకుండా రఘురామ సోషల్‌మీడియా, మీడియా ముందుకు రాకూడదని, ఈ కేసుకు సంబంధించి ఏమి మాట్లాడకూడదని స్పష్టం చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీని వారంలోపు ట్రయల్ కోర్టులో సమర్పించాలన్న సుప్రీం, రఘురామ ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టకూడదని వెల్లడించింది.