ఫ్రెంచ్ ఓపెన్ ఫేవరెట్ అతడే
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ తిరిగి రఫెల్ నాదల్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని టెన్నిస్ ఆటగాడు డోమినిక్ థీమ్ అభిప్రాయపడ్డాడు. బిగ్ త్రీగా పిలుచుకుంటున్న రఫెల్ నదాల్, రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్‌ల తర్వాత వారి స్థానాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉందని టెన్నిస్ పండితులచే పిలవబడుతున్న థీమ్.. గత కొన్నాళ్లుగా కాలిగాయంతో బాధపడుతున్నాడు. 2013 నుంచి టెన్నిస్ ఆడుతున్న థీమ్ ఏ రోజూ ఒక్క టోర్నీని కూడా మిస్ చేయలేదు. అయితే గత నెల […]
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ తిరిగి రఫెల్ నాదల్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని టెన్నిస్ ఆటగాడు డోమినిక్ థీమ్ అభిప్రాయపడ్డాడు. బిగ్ త్రీగా పిలుచుకుంటున్న రఫెల్ నదాల్, రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్‌ల తర్వాత వారి స్థానాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉందని టెన్నిస్ పండితులచే పిలవబడుతున్న థీమ్.. గత కొన్నాళ్లుగా కాలిగాయంతో బాధపడుతున్నాడు. 2013 నుంచి టెన్నిస్ ఆడుతున్న థీమ్ ఏ రోజూ ఒక్క టోర్నీని కూడా మిస్ చేయలేదు.
అయితే గత నెల మియామీ ఓపెన్, గత వారం మాంటె కార్లో టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. తన కెరీర్‌లో టెన్నిన్ టోర్నీల నుంచి వైదొలగడం ఇదే తొలిసారి. మరి కొన్ని రోజుల్లో ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతడు క్లే కోర్టులో విజయం సాధిస్తాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా.. ఈ ఏడాది కూడా నదాల్‌కే టైటిల్ గెలచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆశ్చర్యపరిచాడు. నదాల్‌కు థీమ్ నుంచి గతంలో గట్టి పోటీ ఎదురయ్యింది. కాగా, రికార్డు స్థాయిలో 21 గ్రాండ్‌స్లామ్స్ గెలుచుకోవాలని నదాల్ భావిస్తున్నాడు.