ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

దిశ, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పలు సంచలనాత్మక దొంగతనాలకు పాల్పడే ఇద్దరు అంతరాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేసి, వారిపై పీడీ యాక్ట్ కూడా పెట్టి చర్లపల్లి జైలుకు తరలించారు.బెంగాలీకి చెందిన 7గురు ముఠా సభ్యులు ప్రస్తుతం మహారాష్ట్ర అకోలా జిల్లా ఖిడ్కి గ్రామంలో నివసిస్తున్నారు. వీరంతా బెడ్‌షీట్ అమ్మకం దారులు. బెడ్‌షీట్లు అమ్మేందుకు దేశంలోని రాష్ట్రాలన్నింటికీ వలస వెళ్తారు. అదే క్రమంలో వీరికి హైదరాబాద్ శివార్లలోని వీధులన్నీ సుపరిచితం. ఈ […]

Update: 2020-05-27 11:03 GMT

దిశ, హైదరాబాద్ :
దేశ వ్యాప్తంగా పలు సంచలనాత్మక దొంగతనాలకు పాల్పడే ఇద్దరు అంతరాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేసి, వారిపై పీడీ యాక్ట్ కూడా పెట్టి చర్లపల్లి జైలుకు తరలించారు.బెంగాలీకి చెందిన 7గురు ముఠా సభ్యులు ప్రస్తుతం మహారాష్ట్ర అకోలా జిల్లా ఖిడ్కి గ్రామంలో నివసిస్తున్నారు. వీరంతా బెడ్‌షీట్ అమ్మకం దారులు. బెడ్‌షీట్లు అమ్మేందుకు దేశంలోని రాష్ట్రాలన్నింటికీ వలస వెళ్తారు. అదే క్రమంలో వీరికి హైదరాబాద్ శివార్లలోని వీధులన్నీ సుపరిచితం. ఈ ముఠాను మూడేండ్ల క్రితం “గుమాన్ గ్యాంగ్”గా పిలిచేవారు. వేర్వేరు కాలనీలను ఎంచుకోవడం, హైవే లేదా సెమీ అడవులకు దగ్గరగా ఉంటూ పగటిపూట తిరుగుతుంటారు. అర్ధరాత్రి తరువాత, వారు బండరాళ్లతో ఇంటి తలుపులు తెరిచి, ఘోరమైన ఆయుధాలతో బెదిరించి ఇళ్లను దోచుకుంటారు. చీకటిలో పారిపోతున్నప్పుడు సులువుగా ఉండేందుకు వీరు నిక్కర్ ధరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని రాచకొండ, నిజామాబాద్ ప్రాంతాల్లో 8దోపిడీలకు పాల్పడగా, 2019 డిసెంబర్ 29న హయాత్‌నగర్ పోలీసులు ముఠా సభ్యులను అరెస్టు చేసి, చర్లపల్లి జైలుకి తరలించారు. ఈ క్రమంలోనే 5గురిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై పీడీ యాక్ట్ పెట్టారు. బుధవారం మిగిలిన ఇద్దరు సాధిక్, మొహద్ సాజిద్‌లపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో అరెస్టు చేసిన పోలీసులు వీరిపై కూడా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

Tags:    

Similar News