నిన్ను కాపాడుకోలేకపోయాను : రాయ్ లక్ష్మి

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్‌ రాయ్ లక్ష్మి ఇటీవలే తండ్రిని కోల్పోయింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న లక్ష్మి.. తండ్రి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనను బాగా మిస్ అవుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురైంది. https://twitter.com/iamlakshmirai/status/1324972010896838656?s=20 ‘డాడీ ఐ మిస్ యూ.. నేను ఈ బాధను అధిగమించలేను. మిమ్మల్ని బతికించుకునేందుకు ఎంతో ప్రయత్నించాను. కానీ కాపాడుకోలేకపోయినందుకు క్షమించండి. ఈ లోటు‌తోనే […]

Update: 2020-11-08 02:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్‌ రాయ్ లక్ష్మి ఇటీవలే తండ్రిని కోల్పోయింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న లక్ష్మి.. తండ్రి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనను బాగా మిస్ అవుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురైంది.

https://twitter.com/iamlakshmirai/status/1324972010896838656?s=20

‘డాడీ ఐ మిస్ యూ.. నేను ఈ బాధను అధిగమించలేను. మిమ్మల్ని బతికించుకునేందుకు ఎంతో ప్రయత్నించాను. కానీ కాపాడుకోలేకపోయినందుకు క్షమించండి. ఈ లోటు‌తోనే జీవించేందుకు ప్రయత్నిస్తాను. మీరు నన్ను ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేదు. మీరు లేకున్నా మీ ఆశీర్వాదాలుంటాయని నమ్ముతున్నాను. ఓ కూతురిగా నేను ఏం అడిగినా కాదనకుండా అన్నీ సమకూర్చారు. ప్రతి విషయంలోనూ నా బ్యాక్‌బోన్‌గా ఉన్నారు. మీరు ప్రతిసారి ఇండిపెండెంట్‌గా, ధైర్యంగా ఉండాలని ఎందుకో చెప్పారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మీరు అక్కడ సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని నా మనసు చెబుతోంది. మీరు ఎప్పుడూ నా వెన్నంటే ఉంటూ.. ప్రోత్సాహం అందిస్తారని తెలుసు. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. రెస్ట్ ఇన్ పీస్ దాదా.. లవ్ యు ఫరెవర్’ అంటూ రాయ్ లక్ష్మి భావోద్వేగమైన పోస్ట్‌ను షేర్ చేసింది. కాగా తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదకర సంఘటన నుంచి త్వరగా బయటపడి, తన తండ్రి జ్ఞాపకాలతో లైఫ్‌ను లీడ్ చేయాలని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News