‘రైతన్న’‌ సినిమా చూసిన మంత్రికి ధన్యవాదాలు: ఆర్.నారాయణమూర్తి

దిశ సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన సాగు చట్టాలు రైతులకు ఉరుములు లేని పిడుగు లాంటివని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చే కుట్రలో భాగమే ఆ చట్టాల రహస్యమని ఆయన ఆరోపించారు. అటువంటి ఇతివృత్తాన్ని ఆధారం చేసుకుని ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్.నారాయణ మూర్తి ‘రైతన్న’ సినిమాను రూపొందించారని గుర్తు చేశారు. ఈ సినిమాను మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి […]

Update: 2021-08-19 07:20 GMT

దిశ సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన సాగు చట్టాలు రైతులకు ఉరుములు లేని పిడుగు లాంటివని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చే కుట్రలో భాగమే ఆ చట్టాల రహస్యమని ఆయన ఆరోపించారు. అటువంటి ఇతివృత్తాన్ని ఆధారం చేసుకుని ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్.నారాయణ మూర్తి ‘రైతన్న’ సినిమాను రూపొందించారని గుర్తు చేశారు. ఈ సినిమాను మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి వీక్షించిన నేపథ్యంలో ఆర్.నారాయణ మూర్తి గురువారం రోజున సూర్యాపేటకు చేరుకుని మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఆర్.నారాయణ మూర్తితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులపై అవగాహన కల్పిస్తూనే సమాజంలో చైతన్యం కలిగించేందుకు ఆర్.నారాయణ మూర్తి రూపొందించిన రైతన్న సినిమా దోహదపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గాడిలో పడుతుంది అనుకున్న వ్యవసాయం కేంద్రం తెచ్చే చట్టాలతో అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం రైతన్న సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం తీసుకురానున్న చట్టాలు రైతుల పాలిట శాపాలుగా మారబోతున్నాయన్నారు. ఇప్పటికే బీహార్‎లో ఈ చట్టాలు అమలులో ఉన్నాయని.. దాంతో అక్కడ రైతులు కాస్తా కూలీలుగా మారారన్నారు. ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన విమర్శించారు. అదే జరిగితే యావత్ భారతదేశంలో రైతులే ఉండరని.. మొత్తం కూలీలుగా మారుతారని ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News