ఆ రాణి బర్త్‌డే వేడుకలు క్యాన్సిల్
దిశ, వెబ్‌డెస్క్: గ్రేట్ బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తులైన తర్వాత క్వీన్ ఎలిజబెత్ పుట్టినరోజు వేడుకలు.. ఇప్పటివరకు వాయిదా పడలేవు. క్యాన్సిల్ కూడా కాలేవు. తొలిసారి కరోనా కారణంగా.. ఆమె పుట్టినరోజు వేడుకలను రద్దు చేశారు. రాణి పుట్టినరోజు సందర్భంగా జరిగే.. ‘ట్రెడిషనల్ గన్ సెల్యూట్’ ను కూడా ఈసారికి లేనట్లనని రాయల్ ఫ్యామిలీ వెల్లడించింది. గ్రేట్ బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ మంగళవారం(ఏప్రిల్ 21) నాడు 94 వ సంవత్సరంలో అడుగుపెట్టబోతోంది. కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో సోషల్ […]
దిశ, వెబ్‌డెస్క్: గ్రేట్ బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తులైన తర్వాత క్వీన్ ఎలిజబెత్ పుట్టినరోజు వేడుకలు.. ఇప్పటివరకు వాయిదా పడలేవు. క్యాన్సిల్ కూడా కాలేవు. తొలిసారి కరోనా కారణంగా.. ఆమె పుట్టినరోజు వేడుకలను రద్దు చేశారు. రాణి పుట్టినరోజు సందర్భంగా జరిగే.. ‘ట్రెడిషనల్ గన్ సెల్యూట్’ ను కూడా ఈసారికి లేనట్లనని రాయల్ ఫ్యామిలీ వెల్లడించింది.
గ్రేట్ బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ మంగళవారం(ఏప్రిల్ 21) నాడు 94 వ సంవత్సరంలో అడుగుపెట్టబోతోంది. కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో సోషల్ మీడియా వేదికగా ఫోన్, వీడియోల ద్వారా పుట్టినరోజు వేడుకలను చేస్తామని రాయల్ ఫ్యామిలీ తెలిపింది. అయితే రాణి పుట్టినరోజు సందర్భంగా ప్రతిసారి జూన్ మధ్యలో పరేడ్ జరుగుతుంది. బకింగ్ హమ్ ప్యాలెస్ నుంచి మొదలయ్యే ఈ పరేడ్ లో రాయల్ ఫ్యామిలీ కూడా పాల్గొంటుంది. గత సంవత్సరం దాదాపు 200 గుర్రాలు, 400 మంది సంగీత కళాకారులు, 1400 మంది అధికారులు ఈ పరేడ్ లో పాల్గొన్నారు. కానీ ఈ సారి ఈ పరేడ్ కూడా లేదు. ఈ పరేడ్ సంప్రదాయాన్ని కింగ్ జార్జ్-2 , 1748లో మొదలుపెట్టాడు. అయితే రాణి పట్టాభిషిక్తురాలైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఆమె పుట్టిన రోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కానీ 68 ఏళ్లలో తొలిసారి కరోనా కారణంగా వేడుకలను కాన్సిల్ చేయడం గమనార్హం.
రాణి పట్టాభిషేకం
తండ్రి అనారోగ్యంతో మరణించడంతో 1952 ఫిబ్రవరి 6న బ్రిటన్ రాణిగా రెండో ఎలిజబెత్ బాధ్యతలు స్వీకరించారు. అయితే 1953, జూన్ 2, గ్రేట్ బ్రిటన్ రాణిగా ఆమె పట్టాభిశక్తులయ్యారు. అప్పటికి ఆమె వయస్సు 25 ఏళ్లు. రెండో ఎలిజబెత్ పూర్తి పేరు అలెగ్జాండ్రా మేరీ. 1926 ఏప్రిల్ 21న జన్మించారు. అయితే రాణిగా సింహాసనం అధిష్టించేందుకు తన పేరును ఎలిజబెత్‌గా మార్చుకున్నారు. అయితే 94 ఏళ్ల రెండో ఎలిజబెత్ దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలం పాలించిన రాణిగా చరిత్ర సృష్టించారు. అత్యధిక కాలం పాలన సాగించిన విక్టోరియా రాణి సృష్టించిన చరిత్రను ఆమె తిరగరాశారు. సుమారు 63 ఏళ్లపాటు విక్టోరియా రాణి బ్రిటన్ సామ్రాజ్యాన్ని పాలించారు. ఆ రికార్డును చెరిపివేస్తూ రెండో ఎలిజబెత్ 68 ఏళ్ల నుంచి సింహాసనంపైనే ఉన్నారు.
యూకేలో పరిస్థితి
శనివారం వరకు యూకేలో 1,14,217 కేసులు నమోదు కాగా, 15,464 మంది చనిపోయారు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. 71 ఏళ్ల ప్రిన్స్ చార్లెస్ కూడా కోవిడ్ భారిన పడ్డారు.
tags :coronavirus, queen elizabeth, birthday, parade, britain, uk